Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్

వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వింబుల్డన్‌లో మరో చారిత్రక ఘనత సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్థర్ రిండర్‌క్నెక్‌పై మూడో రౌండ్‌లో 7-5, 6-4, 1-6, 7-6తో విజయం సాధించాడు.

అయితే జకోవిచ్‌కు వింబుల్డన్ టోర్నీలో ఇది 105వ సింగిల్స్ మ్యాచ్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో పురుషుల విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెదరర్ రికార్డును జకోవిచ్ సమం చేశాడు. మహిళల విభాగంలో మార్డినా నవ్రతిలోవా 120 సింగిల్స్ విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఫ్రాన్స్‌పై విజయంతో జకోవిచ్ నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు. కాగా వింబుల్డన్‌లో 7 టైటిళ్లు సాధించిన జకోవిచ్.. ఫెదరర్ ఎనిమిది టైటిళ్ల రికార్డును కూడా సమం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కాగా ఫెదరర్ రికార్డు గురించి మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడాడు. '105 విజయాలతో ఫెదరర్ రికార్డును సమం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అయితే 106వ విజయం కోసం మా ఇద్దరి మధ్య మ్యాచ్ నిర్వహించాలని వింబుల్డన్ నిర్వాహకులను కోరుతున్నా' అంటూ జకోవిచ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

నాలుగో రౌండ్‌లో జకోవిచ్.. రష్యా క్వాలిఫయర్ రోమన్ సఫియులిన్‌తో తలపడనున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ 6-4, 6-3, 6-4తో జన్సన్ బ్రూక్స్‌బైను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో జపాన్ క్వాలిఫయర్ షింటారో మొచిజుకిని ఎదుర్కొంటాడు.

మహిళల విభాగంలో..

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్-1 అరినా సబలెంకా.. జెలెనా ఒస్టాపెంకోపై 6-4, 6-4తో విజయం సాధించింది. మరోవైపు నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ల విజేత నవోమి ఒసాకా 6-1, 6-3తో డారియా కసట్కినాను ఓడించి కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ నాలుగో రౌండ్‌కు చేరుకుంది. తదుపరి రౌండ్‌లో సబలెంకా-ఒసాకా మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అమెరికా స్టార్ కోకో గాఫ్ కూడా మూడో రౌండ్‌లో క్లేర్ లియూను 6-3, 6-7 (5), 6-2తో ఓడించి నాలుగో రౌండ్‌కు అర్హత సాధించింది. అలాగే జెసికా పెగులా, కరోలినా ముచోవా, గత ఏడాది ఛాంపియన్ బార్బోరా క్రెజికోవా కూడా తదుపరి దశకు చేరుకున్నారు.


ఈ పేరు గుర్తు పెట్టుకోండి.. కేప్ వెర్డెపై అశ్విన్ ప్రశంసలు

వైభవ్ 'న్యూ చాప్టర్' పోస్ట్.. రెండో టీ20లో అరంగేట్రం ఖాయం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy