Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీనికి ఫోన్ చేసి చెప్పిందా.. కరోనా థర్డ్ వేవ్‌పై కేసీఆర్

వీనికి ఫోన్ చేసి చెప్పిందా.. కరోనా థర్డ్ వేవ్‌పై కేసీఆర్

వరంగల్: కరోనా సెకండ్ వేవ్‌తో జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆస్పత్రుల్లో లక్షల బిల్లులతో జనం బెంబేలెత్తిపోయారు. వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో కాస్త అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే థర్డ్ వేవ్‌పై వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇబ్బందికరమన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

''స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి. వీనికి ఫోన్ చేసి చెప్పిందా.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే... ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం. దండం పెట్టి చెబుతున్నా...

పుకార్లు మానండి. మాస్కు పెట్టుకోమని చెప్పండి. అంతేకాని భయపెట్టకండి. నాకొచ్చి పాడైంది కరోనా...

చెబితే పంచాయతీ. డాక్టర్‌ని అడిగినా... బీమార్ ఏందో దొరికిందా అని. ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పారు.

అసలే నాది బక్కప్రాణం ఇష్టమొచ్చిన గోలీలు వేయకండని చెప్పా. రెండే రెండు గోలీలు వేసుకున్నాను. ఏదన్నా ఒకటి యాంటీ బయాటిక్ ట్యాబ్లట్ వేసుకోమన్నారు. అదీ వారానికి ఒకటి వేసుకోవాలి అన్నారు.

కానీ నేను వేసుకోలేదు. దీనికి ఇన్ని కథలా... ఇన్ని ప్రచారాలా.. ఇన్ని భయోత్పాతాలా... దయచేసి మీడియా వాళ్లు ఇది గుర్తించాలి. ప్రజల బతుకులతో ఆడుకోవడం సరికాదు'' అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy