Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. దీంతో ఆర్సీబీ ప్లేయర్లు, సిబ్బంది సంబరాలు అంబరాన్నంటాయి.

డ్రెస్సింగ్ రూమ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడి సతీమణి అనుష్క శర్మతో కలిసి కోహ్లీ చేసుకున్న సంబరాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఫైనల్‌లో విజయం అనంతరం ఆర్సీబీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను పంచుకుంది. అందులో కోహ్లీ, అనుష్క శర్మతో పాటు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్, ఇతర జట్టు సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కోహ్లీ స్టెప్పులకు అనుష్క కూడా సర్‌ప్రైజ్ అయింది. విరాట్ డ్యాన్స్ చేస్తుంటే వీడియోలు తీస్తూ మురిసిపోయింది.

పిల్లాడిలా మారిపోయిన కృనాల్..

ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఆనందానికి అవధులే లేవు. తన కెరీర్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున కృనాల్ ఐదుసార్లు ట్రోఫీని అందున్నాడు. ఆర్సీబీ తరఫున ఇది రెండోది కావడం విశేషం. ఆర్సీబీ విన్నింగ్ షాట్ నుంచి సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని హోటల్‌కి వచ్చే వరకు కృనాల్ ట్రోఫీని వదల్లేదు. హోటల్‌కు వెళ్తూ డప్పుల ముందు జట్టు సభ్యులందరూ స్టెప్పులు వేశారు. వారి సందడి జాతరను తలపించింది. డప్పుల స్పీడుకు తగ్గట్లు జోరుగా డాన్స్ చేశారు. కృనాల్ పాండ్య పిల్లాడిగా మారిపోయి ట్రోఫీని నెత్తిన పెట్టుకొని చిందులు వేశాడు. కోహ్లీ కూడా స్టెప్పులు వేస్తూ ఎంకరేజ్ చేశాడు. రసిఖ్ సలామ్ దార్ ఏకంగా డప్పు మీద ఎక్కేసి మరీ చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy