Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన మార్క్‌ను చూపించాడు. విభిన్నమైన షాట్లతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు.

సెహ్వాగ్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ ఆయన ఆటతీరుకు సంబంధించిన జ్ఞాపకాలు అభిమానుల మనసుల్లో నిలిచిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆలోటును ఆయన తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భర్తీ చేసేలా ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) లో ఆర్యవీర్ ఆడుతున్న బ్యాటింగ్ శైలినే అందుకు నిదర్శనం. వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్.. మైదానంలో తన తండ్రిని తలపించేలా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ శైలిలోనే అచ్చం అలాగే కవర్ డ్రైవ్, స్క్వేర్ డ్రైవ్ వంటి ఐకానిక్ షాట్లను అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ యువ బ్యాటర్ ఆడిన కొన్ని షాట్లకు సంబంధించిన వీడియోను డీపీఎల్ నిర్వాహకులు తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తండ్రీకొడుకుల బ్యాటింగ్ టెక్నిక్స్‌లో ఉన్న అద్భుతమైన పోలికలను ఈ వీడియోలో స్పష్టంగా హైలైట్ చేశారు. ఇది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలాఉంటే, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారీగా 232 పరుగులు సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.

strong>

అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..

నా సెంచరీకి శ్రీలంక ప్లేయర్ కూడా కారణం: జురెల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy