Dailyhunt

విశాఖలో ఐటీ వర్సిటీ కోసం నిరీక్షణ : ఐటాప్‌

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, దానితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఐటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఐటా్‌ప) నూతన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌ కొసరాజు పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ఐటాప్‌ నూతన అధ్యక్షునిగా శ్రీధర్‌, కార్యదర్శిగా కిరణ్‌ సంకిట, కోశాధికారిగా శ్రీహరి ఈదర, ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌ పంతుల ఎన్నికయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy