Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివేకా హత్యకేసులో 8వరోజు సీబీఐ విచారణ

వివేకా హత్యకేసులో 8వరోజు సీబీఐ విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎనిమిదో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌, సునీల్‌ కుమార్‌ల తండ్రి కృష్ణయ్యను విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన ఇనాయతుల్లాతో పాటు కిరణ్‌, సునీల్‌లను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునీల్ కుమార్ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట సీబీఐ అధికారులు పులివెందులోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.

దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని కూడా మూడు గంటల పాటు అధికారులు పరిశీలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy