జైపూర్: దేశంలో నిర్ణయించిన కొవిడ్ వ్యాక్సిన్ల ధరలపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వ్యాక్సీన్‌కు ఇన్ని ధరలు ఉండకూడదనీ.. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ తన సొంత నియోజక వర్గం టోంక్‌లో పర్యటించిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో పైలట్ మాట్లాడారు. ''సిమెంట్, స్టీల్, విమానాల ధరలను నియంత్రించ గలిగినప్పుడు... ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్ ధరలను ఎందుకు నియంత్రించలేరు? ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా వేయాలి..'' అని ఆయన పేర్కొన్నారు. ఒకే వ్యాక్సీన్‌కు వేర్వేరు ధరలు నిర్ణయించడంతో ఏమాత్రం ''హేతుబద్ధత లేదని'' పైలట్ అన్నారు.

