హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా రాజేంద్ర నగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వైస్‌ఛాన్సలర్, అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అంతర ప్రవేశ ద్వారం వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి వైస్‌చాన్సలర్ డా. వి. ప్రవీణ్‌రావు, రిజిస్ర్టార్ డా.ఎస్. సుధీర్‌కుమార్ పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది జయశంకర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. పరిపాలన భవనంలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రవీణ్‌రావు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

