Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు

యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు

సిరిసిల్ల టౌన్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : నేటి ప్రపంచంలో మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గిం చుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గం అని గురువు భిక్షమ య్య అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రం మున్నూరుకాపు సంఘం కల్యాణ మండపంలో శ్రీ సత్యసాయి ధాన్య మండలి ఆధ్వర్యంలో బిక్షమయ్య గురూజీ అంతర్ముఖ,ఆనంద ఆరోగ్య యోగా ఒక్కరోజు శిక్షణ శిబిరాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనుషులు అనంత మైన కోరికలతో శారీరక, మానసిక ఒత్తిడిలకు గురి అవుతూ అనే క రుగ్మతులను కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. మనుషులు చక్కటి జీవన విధానానికి యోగా చక్కటి మార్గాన్ని సూచిస్తుందని అన్నారు. ప్రతిరోజు ఒక గంట సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. జీవితం ఎలా గడపాలి, ఎలా జీవించాలో శాస్త్రీయంగా భిక్షమయ్య గురూజీ వివరించారు. ఈ కార్యక్రమంలో నిత్య యోగా సాధకులు బిల్ల శ్రీకాంత్‌, నారాయణ, మొండయ్య, ప్రవీన్‌, విజయ్‌, రాంప్రసాద్‌, ఆదియోగా సాధకులు ఉప్పల శ్రీనివాస్‌, ఆడెపు రవీందర్‌, రణదీర్‌, మనోజ్‌, అశోక్‌, వేణు, శ్రీనివాస్‌, నరేష్‌, ఆర్యవైశ్య యోగా సాధకులు పల్లికొండ గంగాధర్‌ గట్టు భాస్కర్‌, రాజయ్య, రమేష్‌, యాద రమేష్‌, సందీప్‌, శ్రీధర్‌, ఎల్లయ్య, గురు నిలయ మహిళ నిత్య యోగ సాధకులుఆడెపు లావణ్య, శ్రీవాణి, సువర్ణ, జ్యోతి, సునీత, శ్రీదేవి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy