Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యుద్ధ ట్యాంకులు.. ఉక్కు గోడల్లాంటివి: మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులు.. ఉక్కు గోడల్లాంటివి: మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భూతల దాడుల్లో ఇవి ఎంతో కీలకమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని వెహికిల్ ఫ్యాక్టరీ జబల్‌పూర్‌లో టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల మరమ్మతుల కేంద్రానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు.

ఇందుకు కేంద్రం రూ.472 కోట్లను కేటాయించింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

'ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సాయుధ దళాల్లో భారత ఆర్మీ ఒకటి. ఇక భూతల దాడులకు టీ-72, టీ-90 ట్యాంకులు ఎంతో ముఖ్యం. అవి సరిహద్దు వద్ద ఉక్కు గోడలా నిలిచి శత్రు దాడులను అడ్డుకుంటాయి. సరిహద్దు వెంబడి మోహరించిన భద్రతా దళాల ఆత్మస్థైర్యం పెంచుతాయి' అని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రస్తుత యుద్ధ తంత్రంలో డ్రోన్స్, మిసైల్స్ పాత్ర పెరిగినా ట్యాంకుల అవసరం ఇప్పటికీ ఉందని అన్నారు. అన్ని రంగాల్లో భారత సాయుధ దళాల సామర్థ్యం పెరగాలని చెప్పారు. ట్యాంకులు మెరుగ్గా పనిచేసేందుకు వాటికి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ అవసరమని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఈ10 పెట్రోల్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్

కైలాస మానస సరోవర యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy