Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: సబలెంకాతో జతకట్టనున్న జకోవిచ్

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: సబలెంకాతో జతకట్టనున్న జకోవిచ్

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్, ప్రపంచ నంబర్ 1 మహిళా ప్లేయర్ అరీనా సబలెంకా జోడీగా బరిలోకి దిగనున్నారు.

వీరితో పాటు పాల్గొనే 16 జోడీల జాబితాను టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకోవిచ్ అనుభవానికి, సబలెంకా దూకుడు ఆట జత కావడంతో ఈ జోడీ టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన కొత్త మిక్స్‌డ్ డబుల్స్ ఫార్మాట్‌ను యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ (USTA) ఈసారి కూడా కొనసాగిస్తోంది. ఆగస్టు 25, 26 తేదీల్లో సింగిల్స్ ప్రధాన డ్రాకు ముందే ఈ పోటీలు నిర్వహించనున్నారు. విజేత జోడీకి 10 లక్షల అమెరికన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందజేయనున్నారు.

జకోవిచ్, సబలెంకాతో పాటు 2025లో రన్నరప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్, ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్, నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా జకోవిచ్, సబలెంకా కోర్టు వెలుపల కూడా మంచి స్నేహితులు. కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసి సాధన చేయడం, ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. జకోవిచ్ అనుభవం, సబలెంకా పవర్ హిట్టింగ్ కలిస్తే ప్రత్యర్థులకు గట్టి సవాలు తప్పదని టెన్నిస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లో మొత్తం ఆరు జట్లు సింగిల్స్ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత సాధించనున్నాయి. మిగిలిన స్థానాలను వైల్డ్ కార్డులు, క్వాలిఫయర్ల ద్వారా భర్తీ చేయనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్లు సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు కూడా తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోటీలోకి రానున్నారు.

strong>

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్‌లో తెలుగు కుర్రాడికి రజతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy