Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూఎస్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌కు షాక్

యూఎస్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌కు షాక్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్‌కు యూఎస్ ఓపెన్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్ విభాగంలో 46 ఏళ్ల వీనస్‌ను అమెరికాకు చెందిన మరో ప్లేయర్ సోఫియా కెనిన్ తొలి రౌండ్‌లోనే ఓడించింది.

ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెనిన్ 6-2, 7-6(8/6)తో వీనస్‌పై విజయం సాధించింది. యూఎస్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలో వీనస్‌కు ఇది 26వ మ్యాచ్. అలాగే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆమెకు ఇది 96వ మెయిన్‌ డ్రా మ్యాచ్. ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రా ప్రదర్శనలు చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు కొనసాగుతోంది.

ఆరంభం నుంచే..

మ్యాచ్‌ మొదటి నుంచే వీనస్‌కు కష్టాలు ఎదురయ్యాయి. ఆమె తొలి సర్వీస్‌ గేమ్‌ను కెనిన్ బ్రేక్‌ చేసింది. తర్వాతి సర్వీస్‌ గేమ్‌లోనూ బ్రేక్‌ సాధించి 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వీనస్‌ అనవసర తప్పిదాలు, డబుల్‌ ఫాల్ట్‌లతో ఇబ్బంది పడగా.. కెనిన్ తన తొలి, రెండో సర్వ్‌లతో మెరుగ్గా రాణించింది. దీంతో తొలి సెట్‌ను 6-2తో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో వీనస్‌ పోరాటం చేసినప్పటికీ కెనిన్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు టై బ్రేక్‌లో సెట్‌ను ముగించి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఇద్దరికీ చేదు సీజన్‌..

కెనిన్, వీనస్‌ ఇద్దరూ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత, అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ అయిన కెనిన్.. 2026లో తొలి 26 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు విజయాలే సాధించింది. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ విజయంతో ఆమె ఆ సంఖ్యను మెరుగుపరుచుకుంది. మరోవైపు వీనస్‌ విలియమ్స్‌కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ ఓటమితో ఆమె వరుసగా 15 సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసింది. 2026లో ఆడిన మొత్తం 12 సింగిల్స్‌ మ్యాచ్‌ల్లోనూ ఆమెకు విజయం దక్కలేదు. ఇదిలా ఉంటే, తొలి రౌండ్‌లో విజయం సాధించిన కెనిన్.. రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. అక్కడ మూడో సీడ్‌ జెస్సికా పెగులాతో తలపడనుంది.

strong>

యూఎస్ ఓపెన్: టోర్నీ నుంచి జకోవిచ్ ఔట్.. కోర్టులోనే కన్నీళ్లు!

శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy