Dailyhunt
యూకే ప్రధానికి కరోనా.. సలహాదారు పరుగో పరుగు!

యూకే ప్రధానికి కరోనా.. సలహాదారు పరుగో పరుగు!

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సీనియర్ సలహాదారు ప్రధాని నివాసం నుంచి పరుగులు పెడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తనకు కరోనా సోకిందని ప్రధాని ప్రకటించిన కాసేపటికే ఆయన సీనియర్ సలహాదారు అయిన డొమినిక్ కమింగ్స్ డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటపడ్డారు. ఆకుపచ్చ రెయిన్‌కోట్, భుజానికి బ్యాగ్ తగిలించుకున్న ఆయన ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చి పరుగు లంకించుకున్నారు. అయితే, ఆయన ఎందుకు పరుగులు తీశారన్న విషయం తెలియరాలేదు. ప్రధాని నివాసం కూడా ఈ విషయమై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. తన బాస్‌కు కరోనా నిర్ధారణ కావండంతో అది తనకెక్కడ సోకుతుందోనన్న భయంతోనే డొమినిక్ అలా పరుగులు పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

స్థానిక టీవీ చానళ్లు కూడా డొమినిక్ పరుగులు పెడుతున్న వీడియోను ప్రసారం చేశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy