న్యూఢిల్లీ, జనవరి 21: వచ్చే కొన్ని రోజులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు చెందిన యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి 3 గంటల వరకు జరుగుతుందని ఎన్‌పీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. దీని వల్ల యూజర్లకు అసౌకర్యం కలగవచ్చని తెలిపింది. మెరుగైన, సురక్షితమైన చెల్లింపుల కోసం యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు పేర్కొంది.
