Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో ఇద్దరు నేరగాళ్ల ఎన్‌కౌంటర్

యూపీలో ఇద్దరు నేరగాళ్ల ఎన్‌కౌంటర్

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): ఇద్దరు కరడు కట్టిన నేరగాళ్లను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్సు ఎన్‌కౌంటర్ చేసింది.గ్యాంగ్‌స్టర్లు అయిన మున్నా భజరంగి, ముఖ్తార్ అన్సారీ ముఠాలకు చెందిన సభ్యులు 2013లో డిప్యూటీ జైలర్ అనిల్ కుమార్ త్యాగిని హత్య చేశారు. మున్నా భజరంగి ముఠాకు చెందిన వకీల్ పాండే అలియాస్ రాజీవ్ పాండే, హెచ్ఎస్ అంజాద్ అలియాస్ పింటూలు ప్రయాగరాజ్ లో రాజకీయ నేతల హత్యకు పథకం పన్నారు. భదోహి జిల్లాకు చెందిన ఈ నేరగాళ్లు ప్రయాగరాజ్ సమీపంలోని అరైల్ వద్ద కనిపించడంతో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్సు బృందం పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వారు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వకీల్ పాండే అలియాస్ రాజీవ్ పాండే, హెచ్ఎస్ అంజాద్ అలియాస్ పింటూలు హతమయ్యారు.

కాల్పుల్లో మరణించిన గ్యాంగ్ స్టర్ల వద్ద నుంచి పోలీసులు 30, 9 ఎంఎం పిస్టళ్లు, లైవ్ తూటాలు, మోటారుసైకిలును స్వాధీనం చేసుకున్నారు. మృతులైన నేరగాళ్లు జైలర్ అనిల్ త్యాగి హత్యలోనూ పాల్గొన్నారని ఎస్టీఎఫ్ అధికారి నవేందు సింగ్ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy