Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

యూపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం రోజు రాష్ట్రంలో 34,379 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్-19 వల్ల 195 మంది మృతి చెందినట్లు వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,76,765 కరోనా కేసులు నమోదైనట్లు సర్కారు తెలిపింది. కరోనా వల్ల ఇప్పటి వరకు 10,541 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. యూపీలో బుధవారం రోజు 33,214 కరోనా కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 187 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy