హోమ్
Cyclone Nivar: తీరం దాటనున్న నివర్ తుపాను.. ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది?


నివర్ తుపాను మంగళవారం నుంచి గురువారం మధ్య ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను తాకనుంది.
బంగాళాఖాతంలో మొదలైన వాయుగుండం ప్రభావంతో చాలా ప్రాంతల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతం నైరుతి దిశగా ఏర్పడిన ఈ వాయుగుండం గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదులుతోందని, తుఫానుగా మారిందని అధికారులు తెలిపారు.
నివర్ తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరికి రెడ్ అలర్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
This swirling mass of cloud is storm #Nivar, which is currently strengthening in the Bay of Bengal.
— BBC Weather (@bbcweather) November 24, 2020
It is expected to make landfall in India on Wednesday night (local time) as a Very Severe Cyclonic Storm along the Tamil Nadu and Puducherry Coasts, with gusts of up to 120kmh. pic.twitter.com/Cw9NRfTJqZ
ఈ తుపాను నవంబర్ 25న సాయంత్రం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని, ఇది కరైకల్-మామల్లపురం మధ్య తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు..
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు.
మంగళవారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
బుధవారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని, దీని వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకూ చేరవచ్చని చెబుతున్నారు.
తమిళనాడులో సహాయ కార్యక్రమాలకు 30 ఎన్డీఆర్ఎప్ బృందాలను సిద్ధం చేశారు.
నివర్ ఈ ఏడాది బంగాళాఖాతంలో వచ్చిన రెండో తుపాను. ఇంతకు ముందు మేలో అంఫన్ తుపాను వచ్చింది.
The situation today in Chennai's ECR! #CycloneNivar #NivarCyclone #ChennaiRains pic.twitter.com/f3eO4Y8wS2
— The common voice (@tweetsby_) November 24, 2020
ఆంధ్రప్రదేశ్ ముందు జాగ్రత్త...
నివర్ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కునేలా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను సీఎం సమీక్షించారు.
తుపాను నేరుగా ఏపీ తీరాన్ని తాకకపోయినా, తమిళనాడుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో దాని ప్రభావం ఉంటుందని సూచనలు అందాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అదికారులను ఆదేశించారు.
నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లా తీర ప్రాంతాల్లో, కర్నూలు, అనంతపురం జిల్లాలలో 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సీఎం చెప్పారు.
పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని, ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో ఏర్పాట్లు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మంగళవారం ఉదయం తుపాను ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముందు జాగ్రత్త కోసం పుదుచ్చేరిలో సెక్షన్ 144 అమలు చేశారు. అన్ని షాపులు, కార్యాలయాలను నవంబర్ 24 రాత్రి 9 నుంచి నవంబర్ 26 ఉదయం 6 గంటల వరకూ మూసివేయాలని ఆదేశించారు.
అటు తమిళనాడులో 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని భావిస్తున్నారు.
1) Cyclone "NIVAR" to cross Tamilnadu-Puducherry coasts between Karaikal and Mamallapuram as a very severe cyclonic storm during late evening of 25th November.
— India Meteorological Department (@Indiametdept) November 24, 2020
2)Depression over Gulf of Aden and adjoining Somalia weakened into a well marked low pressure area. pic.twitter.com/ZWzqjnbDUB
తుపాను బుధవారం సాయంత్రం తీరం దాటుతుందని, ఈ ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్రన్ చెప్పారు.
చెన్నై, మిగతా ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
తమిళనాడులో ఏడు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. ప్రయాణాలు మానుకోవాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలను కోరింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
source: bbc.com/telugu