పోలవరం ప్రాజెక్టు: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?

Tuesday, 26 Dec, 5.47 am

పోలవరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ!

గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు.

ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది.

అయినా కథ సాఫీగా నడవడం లేదు. అనేక ఒడుదొడుకుల మధ్య పయనిస్తోంది.

సకాలంలో నిధులు ఇవ్వడం లేదంటోంది రాష్ట్రం. ఇచ్చినవాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది.

ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏమిటి?

దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం పదండి..

  • అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?

ఇలా ప్రారంభం

పోలవరం ప్రాజెక్ట్‌ ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది.