Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
" సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి".. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

" సేవ్ చేసిన రీల్స్ నిజమయ్యాయి".. సాయి ధరమ్ తేజ్ కొత్త పోస్ట్! !

Big TV Live 5 days ago

Sai Dharam tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్విట్జర్లాండ్ ట్రిప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఎప్పటి నుంచో సేవ్ చేసి పెట్టుకున్న రీల్స్, కలల వెకేషన్‌ను నిజం చేసుకుంటూ ఆయన స్విట్జర్లాండ్‌లోని అందమైన బర్న్ నగరానికి చేరుకున్నారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన అద్భుతమైన ఫోటోలను పంచుకుంటూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ఆ విశేషాలు చూద్దాం..

చారిత్రక నగరంలో అల్లరి:

బర్న్ నగరంలోని పురాతన కట్టడాలు, క్లాసికల్ ఆర్చ్‌లు, అందమైన పెయింటింగ్స్‌తో ఉన్న ఒక చారిత్రాత్మక భవనంలో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సాయి దుర్గ తేజ్ సందడి చేశారు. “ఎట్టకేలకు సేవ్ చేసిన రీల్స్ నుండి బయటపడి ఇక్కడికి వచ్చాం” అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ చూస్తే, ఈ వెకేషన్ కోసం ఆయన ఎంతగానో ఎదురుచూశారో అర్థమవుతోంది.

విరామం తర్వాత పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ:

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. ఘోరమైన బైక్ ప్రమాదం అనంతరం పూర్తిగా కోలుకోవడానికి, శారీరకంగా, మానసికంగా మళ్లీ ఫిట్ అవ్వడానికి తేజ్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గ్యాప్‌కు ముగింపు పలుకుతూ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా విడుదల తర్వాతే తన తదుపరి ప్రాజెక్టులను ప్రారంభించాలని తేజ్ ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఆయన కెరీర్‌లో కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

తేజ్ కొత్త సినిమాలు..

ఇక అభిమానులను మరింత ఉత్సాహపరిచే విషయం ఏంటంటే… తేజ్ చేతిలో ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్‌తో పాటు సందీప్‌తో కూడా కొత్త సినిమాలు చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 'సంబరాల ఏటిగట్టు' విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. 'విరూపాక్ష' సక్సెస్‌తో వచ్చిన ఊపు, ఈ సినిమాతో మరింత స్ట్రాంగ్ అవ్వొచ్చు. ఈ సినిమా కనక హిట్ అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ వరుస సినిమాలతో మరోసారి పీక్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా షూటింగుల బిజీ నుండి కాస్త బ్రేక్ తీసుకుని, తనకు ఎంతో ఇష్టమైన స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళడం, అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి మెమరబుల్ క్షణాలను గడపడం సాయి దుర్గ తేజ్‌కు ఎనర్జీని ఇచ్చి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రీఫ్రెషింగ్ ట్రిప్ ముగించుకుని ఆయన త్వరలోనే సరికొత్త జోష్‌తో ‘సంబరాల ఏటి గట్టున’ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live