Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

Big TV Live 1 month ago

Telugu feel good web series: ఇటీవల కాలంలో ఓటీటీల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్లు, హారర్, సస్పెన్స్ కథలే కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ఎలాంటి హింస, రక్తపాతం లేకుండా కుటుంబమంతా కలిసి హాయిగా చూడదగ్గ ఓ వెబ్ సిరీస్ వచ్చిందంటే ఆసక్తి కలగడం సహజమే.

అదే ‘హరిచంద్ర కథ’ (Hari Chandra Katha). నిరుద్యోగ యువత ఎదుర్కొనే ఒత్తిళ్లు, మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, నవ్వులు… ఇలా అన్నింటినీ కలిపి ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. మరో విశేషం ఏమిటంటే… మొత్తం సిరీస్‌ షూటింగ్ ను కేవలం 11 రోజుల్లోనే పూర్తి చేశారు. మరి ఇంత షార్ట్ టైమ్ లో తెరకెక్కించిన ఆ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హరి అనే మధ్యతరగతి యువకుడు చదువు పూర్తయినా సరైన ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడుతుంటాడు. జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉన్నా, అవకాశాలు మాత్రం అతని తలుపు తట్టవు. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆశలు, మరోవైపు బంధువుల మాటలు, సమాజం పెట్టే పోలికలు… ఇవన్నీ అతనిపై మానసిక ఒత్తిడిని పెంచుతుంటాయి. అయినప్పటికీ తన కలలను వదులుకోకుండా ముందుకు సాగాలని హరి ప్రయత్నిస్తుంటాడు.

అలాంటి సమయంలో అనుకోకుండా అతనికి ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది. అయితే అది సాధారణ ఉద్యోగం కాదు. కొన్ని పరిస్థితుల కారణంగా అతను బ్యాక్‌డోర్ మార్గంలో ఆ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. మొదట్లో అంతా సాఫీగా సాగుతున్నట్టు కనిపించినా, క్రమంగా ఆ ఉద్యోగం వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలు అతని కళ్ల ముందుకు వస్తాయి. ఆ రహస్యాల వల్ల హరి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు… అతని ప్రేమ, కుటుంబ బంధాలు కూడా ఊహించని మలుపులు తిరుగుతాయి.

ఇదే సమయంలో హరి జీవితంలోకి వచ్చే కొంతమంది వ్యక్తులు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తారు. ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద సమస్యకు దారితీస్తుందో, అలాగే ఒక మంచి మనసు ఎన్నో జీవితాలను ఎలా మార్చగలదో దర్శకుడు చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. మధ్యలో వచ్చే సరదా కామెడీ సన్నివేశాలు కథను ఎక్కడా బోర్ కొట్టనివ్వవు.

చివరికి హరి తన కలలను నిజం చేసుకున్నాడా ? ఉద్యోగం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అతని ప్రేమకథకు ఎలాంటి ముగింపు దక్కింది ? కుటుంబ సభ్యుల నమ్మకాన్ని తిరిగి సంపాదించగలిగాడా ? అనే విషయాలను మాత్రం సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

‘హరిచంద్ర కథ’ సిరీస్ ప్రస్తుతం Aha Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో హరినాథ్ రాజ్, హేమ గొర్లె ప్రధాన పాత్రల్లో నటించారు. బి2పి స్టూడియోస్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించారు. కేవలం 11 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఈ సిరీస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడదగ్గ, నవ్వులు పంచే, ఆలోచింపజేసే ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్ కోసం చూస్తుంటే ‘హరిచంద్ర కథ’ను తప్పకుండా చూడాల్సిందే. మధ్యతరగతి యువత జీవితాన్ని చాలా సహజంగా చూపిస్తూ, ఎమోషన్స్‌తో పాటు కామెడీని కూడా చక్కగా మిళితం చేశారు. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. ఈ వీకెండ్‌లో ఒక ఫీల్ గుడ్ తెలుగు వెబ్ సిరీస్ చూడాలని అనుకుంటే, ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హరిచంద్ర కథ’ను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.

దేశం కోసం కుటుంబాన్నే రిస్క్‌లో పెట్టిన మహిళ… సీజన్ 3లో షాకింగ్ ట్విస్టులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live