Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
144Hz డిస్‌ప్లే, 100x జూమ్ కెమెరాతో Vivo S60 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!

144Hz డిస్‌ప్లే, 100x జూమ్ కెమెరాతో Vivo S60 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!

Big TV Live 2 weeks ago

Vivo S60 Series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చైనా మార్కెట్లో సరికొత్త మిడ్‌రేంజ్ మొబైల్‌ను పరిచయం చేసింది. Vivo S60 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌తో పాటు Vivo S60 వైటాలిటీ ఎడిషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

ఆకర్షణీయమైన కలర్స్, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్లు జూన్ 3 నుంచి అమ్మకానికి రానున్నాయి.

ఆకట్టుకునే డిజైన్:

ఈ సరికొత్త ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో పాటు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి ప్రత్యేక రేటింగ్స్ ఇచ్చారు. దీని వెనుక భాగంలో గ్లాస్ డిజైన్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

100x డిజిటల్ జూమ్ కెమెరా:

Vivo S60 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు కాబట్టి.. ఫోన్ స్పీడ్‌గా పని చేస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. దీనిలో 50MP ప్రధాన కెమెరాతో పాటు, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే 50MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 50MP కెమెరాను అమర్చారు.

AMOLED స్క్రీన్, 12 రోజుల బ్యాటరీ.. డైరెక్ట్ టైప్-సి ఛార్జింగ్‌తో దుమ్ములేపుతున్న బోట్ కొత్త వాచెస్!

భారీ బ్యాటరీ బ్యాకప్:

ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఏకంగా 7200mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

వైటాలిటీ ఎడిషన్ ప్రత్యేకతలు:

Vivo S60 వైటాలిటీ ఎడిషన్ విషయానికి వస్తే.. డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ వంటివన్నీ మెయిన్ మోడల్ లాగే ఉంటాయి. అయితే ఇందులో పెరిస్కోప్ కెమెరా ఉండదు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌ను ఆ ఫోన్లను ఉపయోగించారు. మెయిన్ మోడల్‌తో పోలిస్తే.. దీని బరువు కాస్త తక్కువగా ఉంటుంది.

ధరల వివరాలు ఇలా:

వివో S60 బేస్ వేరియంట్ (12GB+256GB) ధర చైనాలో సుమారు రూ.50,000గా ఉంది. అలాగే టాప్ మోడల్ ధర దాదాపు రూ.62,000 వరకు ఉంది. ఇక వైటాలిటీ ఎడిషన్ ప్రారంభ ధర సుమారు రూ.41,000గా నిర్ణయించారు. ఇవి త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఫీచర్లు తెలిస్తే అస్సలు వదలరు.. సింగిల్ ఛార్జ్‌తో 55 గంటలు రన్ అయ్యే వివో కొత్త ఇయర్‌బడ్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live