Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
15 ఏళ్ల వైభవ్ ను బెదిరించిన రియాన్ పరాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డప్ అంటూ!

15 ఏళ్ల వైభవ్ ను బెదిరించిన రియాన్ పరాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డప్ అంటూ!

Big TV Live 1 week ago

Parag -Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ శుక్రవారం జరిగింది.

న్యూ చండీగఢ్ లోని మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Mullanpur, New Chandigarh) వేదికగా ఈ మ్యాచ్ జరగగా.. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సెంచరీ మిస్ చేసుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Sooryavanshi ) రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ( Riyan Parag) బెదిరించిన సంఘటన వైరల్ గా మారింది. డగౌట్ లో కూర్చున్న వైభవ్ దగ్గరికి వెళ్లి, వేళ్ళు చూపిస్తూ మరి బెదిరించాడు రియాన్ పరాగ్. ఈ క్రమంలో వైభవ్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. నీకే ఆడడం చేతకాదు.. మా వైభవ్ సూర్య వంశీని బెదిరిస్తున్నావా ? అని రెచ్చిపోతున్నారు.

RR VS SRH Eliminator Match: వైభవ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగలో కలిపావ్, కమిన్స్ పరువు తీసిన యాంకర్‌

వరుసగా రెండోసారి సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్

రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఈసారి టోర్నమెంట్ లో అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ పైన 97 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ పైన 96 పరుగులు చేసి రాణించాడు. 90 వచ్చిన తర్వాత సిక్సర్ కోసం ప్రయత్నించిన వైభవ్ సూర్యవంశీ, ప్రతిసారి ఔట్ అవుతున్నాడు. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా కూడా మెల్లిగా ఆడకుండా సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత డగౌట్ కు వచ్చిన వైభవ్ సూర్య వంశీకి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోనే వైరల్ గా మారింది. అయితే వైభవ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు రియాన్ పరాగ్ హావభావాలు కనిపించాయి. వేలు పెట్టి చూపించడం వైభవ్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. ఈ క్రమంలోనే రియాన్ పరాగ్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ ఇంటికి… ఫైనల్స్ కు గుజరాత్ టైటాన్స్

న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఓటమిపాలైంది. రాజస్థాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ కు వెళ్ళింది. దీంతో మే 31వ తేదీన అంటే ఎల్లుండి ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live