Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
15 ఏళ్ల వైభవ్ విధ్వంసం, కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

15 ఏళ్ల వైభవ్ విధ్వంసం, కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

Big TV Live 1 month ago

Vaibhav-Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితులలో హైదరాబాద్ చేతులెత్తేసింది.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దెబ్బకు హైదరాబాద్ సరెండర్ అయిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (Sunrisers Hyderabad vs Rajasthan Royals ) జట్లు నిన్న న్యూ చండీగఢ్ (Mullanpur, New Chandigarh) వేదికగా తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ పై 47 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో హైదరాబాద్ ఇంటి దారి పట్టగా, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ కు అర్హత సంపాదించింది.

Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో

15 ఏళ్ల వైభవ్ దెబ్బకు కావ్య పాప కన్నీళ్లు ?

న్యూ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయిన నేపథ్యంలో కావ్య పాప కన్నీళ్లు ( Kavya Maran is crying) పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దెబ్బకు కావ్య పాప తల తిరిగిపోయిందని సెటైర్లు పేల్చుతున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ పైన హైదరాబాద్ గెలిచినప్పుడు కావ్య పాప ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశిస్తూ.. ఇక మీ పని అయిపోయింది.. వెళ్లిపోండి అంటూ సైగలు చేశారు. నోర్లు మూసుకొని, దొబ్బెయ్యండి అంటూ రెచ్చిపోయారు కావ్య పాప. అయితే నిన్నటి మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 97 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల బుడ్డోడి కారణంగా కావ్య పాప పొగరు మొత్తం దిగిపోయిందని సెటైర్లు పేల్చుతూ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆడుకుంటున్నారు. ఆ కుర్రాడి దెబ్బకు స్టేడియంలో కావ్య పాప కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఇకపై మ్యాచ్ గెలిచిన తర్వాత సైలెంట్ గా కూర్చోవాలి తప్ప.. మరో జట్టును హేళన చేయకూడదని కౌంటర్లు ఇస్తున్నారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కౌంటర్లు పేల్చుతున్నారు.

ఇషాన్ కిషన్ ను కూడా తగులుకున్న చెన్నై ఫ్యాన్స్‌

గ్రూప్ స్టేజ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను మొన్న హైదరాబాద్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ముందే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను రెచ్చగొట్టాడు. స్టేడియం నుంచి వెళ్లిపోండి అంటూ అవమానించాడు. విజిల్స్ వేస్తూ చెన్నై అభిమానులను దారుణంగా ఆడుకున్నాడు ఇషాన్ కిషన్. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన క్రమంలో.. ఇషాన్ కిషన్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. ఎప్పుడైతే చెన్నైని గెలికాడో.. అప్పటినుంచి ఇషాన్ కిషన్ కెరీర్ క్లోజ్ అయిందంటూ చురకలు అంటిస్తున్నారు. అందుకే రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా హైదరాబాద్ ఓడిపోయిందని దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు చెన్నై అభిమానులు.

Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live