Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు. 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు. 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

Big TV Live 2 weeks ago

Science Fiction Movie: సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చాలామందికి భారీ గ్రాఫిక్స్, అంతరిక్ష యుద్ధాలు, సూపర్ హీరోలు గుర్తుకొస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి హంగులు లేకుండానే మనసును కదిలిస్తూ ఆలోచింపజేస్తాయి.

అలాంటి అరుదైన చిత్రాల్లో ‘చిల్డ్రన్ ఆఫ్ మెన్’ (Children of Men 2006) ఒకటి. విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల జాబితాలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు అల్ఫోన్సో క్వారన్ రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. భవిష్యత్తు ప్రపంచాన్ని అత్యంత వాస్తవికంగా చూపిస్తూ, ఆశ, మానవత్వం, మనుగడ వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి సినీ ప్రేమికుడు తప్పకుండా చూడాల్సిన చిత్రంగా నిలిచింది. మరి ఇలాంటి అద్భుతమైన మాస్టర్ పీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 2027 సంవత్సరంలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలు గర్భం దాల్చే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. వరుసగా 18 సంవత్సరాల పాటు ఒక్క బిడ్డ కూడా జన్మించదు. దీంతో మానవజాతి అంతరించిపోతుందనే భయం ప్రపంచాన్ని కమ్మేస్తుంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తాయి. శరణార్థుల సమస్యలు, అల్లర్లు, హింస, నిరాశలతో ప్రపంచం పూర్తిగా మారిపోతుంది.

ఈ పరిస్థితుల్లో సాధారణ జీవితం గడుపుతున్న థియో అనే వ్యక్తి అనుకోకుండా ఒక రహస్య మిషన్‌లో భాగమవుతాడు. ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక్క గర్భవతి ఉన్నట్లు అతనికి తెలుస్తుంది. ఈ విషయం బయటకు వస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదమని తెలుసుకున్న కొందరు, ఆమెను సురక్షితంగా ఒక రహస్య పరిశోధనా సంస్థ వద్దకు చేర్చే బాధ్యతను థియోకు అప్పగిస్తారు.

ఆ తర్వాత ప్రారంభమయ్యే ప్రయాణం అసలు కథ. ప్రతి అడుగులో ప్రమాదం, ప్రతి మలుపులో ప్రాణహాని, ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు గ్రూపులు, రాజకీయ కుట్రలు మధ్య థియో ఆమెను ఎలా కాపాడాడు ? మానవజాతి చివరి ఆశగా మారిన ఆ బిడ్డ సురక్షితంగా జన్మించిందా ? ప్రపంచ భవిష్యత్తు ఏ దిశగా వెళ్లింది ? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా క్లైమాక్స్.

తెలుగులో ఉందా లేదా ?

ఈ సినిమాకు ప్రధాన బలం అల్ఫోన్సో క్వారన్ దర్శకత్వం. కట్‌లు లేకుండా చిత్రీకరించిన లాంగ్ టేక్ యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికీ సినిమాటోగ్రఫీలో మాస్టర్ క్లాస్‌గా చెప్పుకుంటారు. ముఖ్యంగా కార్ ఛేజ్, క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలో భాగం చేసినట్లు అనిపిస్తాయి. క్లైవ్ ఓవెన్ నటన, సహజమైన విజువల్స్, హృదయాన్ని తాకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. అంతేకాదు, శరణార్థుల సమస్య, నియంతృత్వ పాలన, మానవ హక్కులు, ఆశ, నిరాశ వంటి అనేక సామాజిక అంశాలను కూడా ఈ చిత్రం చాలా లోతుగా చూపించారు. అందుకే ఇది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఆలోచింపజేసే కథగా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు. భారీ యాక్షన్ కంటే బలమైన కథ, అద్భుతమైన విజువల్స్, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే డిస్టోపియన్ థ్రిల్లర్లు చూడాలనుకుంటే ఈ కల్ట్ క్లాసిక్ ను అస్సలు మిస్ అవ్వొద్దు. సినిమా ముగిసిన తర్వాత కూడా చాలా సేపు మీ ఆలోచనల్లో నిలిచిపోయే అరుదైన అనుభూతిని ఈ చిత్రం అందిస్తుంది.

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live