శరీర దారుఢ్యంలో భాగంగా అందమైన చేతులు కావాలని చాలా మంది కోరుకుంటారు. బలమైన బైసెప్స్ చేతుల బలాన్ని పెంచుతాయి. దీని కోసం సరైన వ్యాయామాలు, టెక్నిక్‌లతో త్వరగా మంచి ఫలితాలు వస్తాయి.
ఇంట్లోనైనా జిమ్‌లోనైనా సులభంగా బైసెప్స్ పెంచుకోవచ్చు.
బైసెప్స్ శిక్షణ ఎందుకు చాలా ముఖ్యం
బైసెప్స్ కండరాలు.. బరువు ఎత్తడం, లాగడం.. రోజువారీ పనుల్లో సహాయపడతాయి. బలమైన బైసెప్స్ శరీర ఎగువ భాగం ఆకృతిని అందంగా చూపిస్తాయి. ఇవి ఇతర కండరాల వ్యాయామంలో కూడా తోడ్పడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బలం పెరుగుతుంది.
బార్‌బెల్ కర్ల్స్.. బైసెప్స్ పెరుగుదలకు బెస్ట్
బైసెప్స్ కోసం బార్‌బెల్ కర్ల్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ఈ టెక్నిక్‌తో బైసెప్స్ రెండు భాగాలు ఒకేసారి పని చేస్తాయి. బార్‌బెల్‌ను గట్టిగా పట్టుకొని నెమ్మదిగా ఛాతీ వైపు ఎత్తండి. మోచేతులు స్థిరంగా ఉంచాలి. ఈ వ్యాయామం త్వరగా కండరాల సైజు పెంచుతుంది.
సరైన కంట్రోల్ కోసం డంబెల్ కర్ల్
డంబెల్ కర్ల్స్ రెండు చేతులకు వేర్వేరుగా ట్రైన్ చేయడానికి అనువైన వ్యాయామం. డంబెల్స్‌ను ఒక్కొక్కటిగా లేదా కలిపి నెమ్మదిగా ఎత్తండి. ఇది కండరాల అసమానతను సరిచేస్తుంది. కాలక్రమేణా చేతులు సమానంగా అందంగా మారతాయి.
హామర్ కర్ల్‌తో మరింత మందమైన చేతులు
హామర్ కర్ల్ లోపలి కండరాలను బలపరుస్తుంది. డంబెల్స్‌ను అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా ఉంచి ఎత్తండి. ఈ వ్యాయామం చేతుల మందం పెంచడంతో పాటు ముంజేతుల బలాన్ని కూడా పెంచుతుంది.
మాగ్జిమం బెనిఫిట్స్ కోసం కాన్సంట్రేషన్ కర్ల్ బైసెప్స్
కూర్చొని మోచేయిని తొడపై ఆనించి డంబెల్‌ను నెమ్మదిగా భుజం వైపు ఎత్తండి. ఈ వ్యాయామం బైసెప్స్‌కు గరిష్ట ఆకృతిని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల చేతులు సరైన పర్ఫెక్ట్ ఆకారంలో అందంగా కనిపిస్తాయి.
చిన్ అప్స్ సహజ బలాన్ని ఇస్తాయి
చిన్ అప్స్ బాడీవెయిట్ వ్యాయామం. అరచేతులు మీ వైపు ఉంచి కొంచెం ఎత్తులో ఉండే బార్ పట్టుకొని శరీరాన్ని పైకి లాగండి. ఇది బైసెప్స్‌తో పాటు వీపు, భుజాలను కూడా బలపరుస్తుంది.
కండరాలపై నిరంతర ఒత్తిడి కోసం కేబుల్ కర్ల్
కేబుల్ కర్ల్ పూర్తి కదలికలో కండరాలపై ఒత్తిడి ఉంచుతుంది. నిటారుగా నిలబడి కేబుల్ హ్యాండిల్‌ను పైకి లాగండి. ఇది కండరాల సహనశక్తిని పెంచుతుంది.
లవ్ బైట్స్‌తో ప్రాణాలకే ప్రమాదం.. మీ పార్ట్‌నర్ అలా చేస్తే వెంటనే ఆపండి
త్వరగా బైసెప్స్ పెరగడానికి చిట్కాలు
వ్యాయామం ముందు వార్మ్ అప్ చేయండి. సరైన ఫామ్‌తో వ్యాయామం చేయండి. తేలికపాటి బరువులతో ప్రారంభించి నెమ్మదిగా పెంచండి. వారానికి కనీసం రెండు సార్లు బైసెప్స్ శిక్షణ ఇవ్వండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి.
ఈ జాగ్రత్తలు పాటించండి
ఎక్కువ బరువు త్వరగా ఎత్తడం ప్రమాదకరం. శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. నెమ్మదిగా, నియంత్రణతో వ్యాయామం చేయండి.
బలమైన బైసెప్స్ నిర్మాణానికి క్రమశిక్షణ, సరైన ఫామ్, మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. సాధారణ వ్యాయామాలు కూడా క్రమం తప్పకుండా చేస్తే అద్భుత ఫలితాలు ఇస్తాయి.

