Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Big TV Live 2 weeks ago

Pallaburusu OTT: ఈ మధ్యకాలంలో థియేటర్లలో ఎలా అయితే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారో..ఇటు ఓటీటీలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లలేని ఎంతోమంది ఇటు ఓటీటీలలో తమకు వచ్చిన చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు దాదాపు 4 లేదా 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి.కానీ ఇక్కడ ఒక సినిమా థియేటర్లలో విడుదలై 20 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన పళ్లబురుసు..

ఈ మధ్యకాలంలో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది..అలా బలగం చిత్రంలో తమ నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), మురళీధర్ గౌడ్ (Muralidhar gowd) తండ్రి కొడుకులుగా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 14న విడుదలైన చిత్రం పళ్లబురుసు. అన్నపూర్ణ నిర్మాణ సంస్థ నిర్మాణంలో వచ్చిన ఈ చిన్న సినిమా ప్రమోషన్లలో పర్వాలేదనిపించారు. కానీ కంటెంట్ ఒక మాదిరిగా ఉండేసరికి జనాలు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే చడీ చప్పుడు లేకుండా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

పళ్లబురుసు స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే తెలంగాణలోని ఒక పల్లెటూరులో ఉండే వృద్ధుడు శంభు (సుధాకర్ రెడ్డి) ఒకసారి పంటి నొప్పితో హాస్పిటల్ కి వెళ్ళగా.. చికిత్స చేసిన డాక్టర్ వేప పుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో అది కొనివ్వమని శంభు తన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్) ను అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తనను పిలవకుండా మనవరాలు పెళ్లిని కొడుకు చేయడంతో శంభు మరింత అవమానంగా ఫీల్ అవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకు పై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు.

ఈ ప్రశ్నలకు సమాధానమే పళ్లబురుసు..

ఇక ఈ కేసు వల్ల తండ్రి కొడుకులు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? స్వయానా కూతురు పెళ్లి జరుగుతుండగా.. తన తండ్రిని పిలవకపోవడం ఏమిటి? చివరికి ఏమైంది ? కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పునిచ్చింది? అనే విషయం తెలియాలి అంటే సినిమా తెరపై చూడాల్సిందే. ఎమోషనల్ భావోద్వేగాలతో పరవాలేదనిపించారు..కానీ ఈ స్టోరీని మరింత డెప్త్ గా రాసుకొని ఉండుంటే కచ్చితంగా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేదేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 20 రోజులు కూడా గడవక ముందే అప్పుడే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live