Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2026 హారర్ హిట్ 'ది మమ్మీ' ఓటీటీలోకి. ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

2026 హారర్ హిట్ 'ది మమ్మీ' ఓటీటీలోకి. ఈ 2 రీజన్స్ తెలుసుకున్నాక మూవీ జోలికే వెళ్లరు

Big TV Live 1 month ago

The Mummy on OTT : హాలీవుడ్ హారర్ చిత్రాల ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. లీ క్రోనిన్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ 'ది మమ్మీ' (The Mummy - 2026) ఇండియాలో డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది.

ఇది గుడ్ న్యూసే. కానీ ఈ రెండు రీజన్స్ వింటే అస్సలు ఆ సినిమా జోలికే వెళ్లరు. మరి ఇంతకీ సినిమా కంటే ఎక్కువగా భయపెట్టే ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

రెంటు బేసిస్ లో

కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయంగా ‘ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్’ (PVOD) పద్ధతిలో రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఇక ఇప్పుడు ఎట్టకేలకు భారతీయ ఓటీటీ వీక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. అయితే ఈ డిజిటల్ రిలీజ్ వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలతో పాటు, సినీ లవర్స్‌కు షాక్ ఇచ్చే ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఈ భయంకరమైన హారర్ థ్రిల్లర్ ను ఏకంగా రెండు ఓటీటీలలో చూసే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), బుక్‌మైషోకి చెందిన బీఎంఎస్ స్ట్రీమ్ (BMS Stream) లలో ఈ సినిమా డిజిటల్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమాను రెండు ఓటీటీలలోనూ ఉచితంగా చూసే ఛాన్స్ లేదు. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ. 499 రెంట్, బుక్‌మైషో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 549 గా ఉంది. ఒక సినిమాను ఓటీటీలో ఇంత రేటు పెట్టి చూడడం అన్నది చాలా ఎక్కువని చెప్పాలి. సాధారణంగా థియేటర్ టికెట్ ధర కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం సామాన్య ప్రేక్షకులకు పెద్ద భారమే. అందుకే ఈ మూవీని ఓటీటీలో కంటే థియేటర్లలో చూడడమే బెటర్.

Also Read : చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్‌… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ

ప్రాంతీయ భాషల కొరత

రెంట్ బేసిస్ లో ఈ మూవీని చూడడమే బిగ్ మైనస్ అనుకుంటే, డబ్బింగ్ లో అందుబాటులో లేకపోవడం కూడా మరో కొరత. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల ఆడియో ట్రాక్‌ లు అందుబాటులో లేకపోవడం నిరాశను కలిగించే విషయం. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో అద్భుతమైన డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఆ ఆడియో ట్రాక్‌లను ఇంకా అప్‌లోడ్ చేయలేదు సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్. కేవలం ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి ఈ సినిమాను సొంత ప్రాంతీయ భాషల్లో చూసి ఆస్వాదించాలనుకునే ఆడియన్స్ కు ఇది పక్కా డిసప్పాయింట్ చేసే విషయమే. ఈ చిత్రంలో లాయా కోస్టా, జాక్ రేనార్, వెరోనికా ఫాల్కన్, ‘మూన్ నైట్’ ఫేమ్ మే కలమావి లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live