Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Big TV Live 3 weeks ago

TG Police Notification 2026: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. హోంశాఖ పరిధిలో ఏకంగా 7,000 ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 5,000 పోస్టులకు సంబంధించిన అధికారిక జీవో కూడా విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను ప్రభుత్వం రెండు విడతల్లో వేగంగా పూర్తి చేయనుంది. మరి ఏ ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జీవో విడుదల.. ఏ పోస్టులు ఎన్నంటే?

మొదటి విడతలో భాగంగా 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ 5 వేల ఉద్యోగాలలో అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి.

సివిల్ కానిస్టేబుల్: 3,697 పోస్టులు

ఏఆర్ (AR) కానిస్టేబుల్: 1,052 పోస్టులు

సివిల్ ఎస్సై (SI): 148 పోస్టులు

ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై: 23 పోస్టులు

కానిస్టేబుల్ పీటీఓ (PTO): 20 పోస్టులు

ఏఆర్ ఎస్సై (AR SI): 14 పోస్టులు

టీజీఎస్పీ ఏఆర్ఎస్సై (TGSP ARSI): 12 పోస్టులు

ఇతర పోస్టులు: ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ (24), ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్సై (3) ఖాళీలు ఉన్నాయి.

ఇక మిగిలిన 2,000 పోస్టులు ఎస్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించినవి కాగా.. వీటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా ఒకటి రెండు రోజుల్లోనే వెలువడనున్నాయి.

తెలంగాణలో 4వ అతిపెద్ద నోటిఫికేషన్:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హోంశాఖలో రాబోతున్న నాలుగో అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. గతంలో 2015లో తొలిసారిగా 9,281 పోస్టులతో, ఆ తర్వాత 2018లో రెండోసారి భారీగా 17,500 పైగా పోస్టులతో, అనంతరం 2022లో మూడోసారి 16,000 పైగా పోస్టులతో నోటిఫికేషన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ 2026లో ఈ 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ అభ్యర్థులకు ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

నోటిఫికేషన్ ఎప్పుడు?

ప్రభుత్వ అనుమతి లభించడంతో తెలంగాణ పోలీస్‌ నియామక మండలి (TSLPRB) రంగంలోకి దిగింది. నియామక ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అన్ని పనులు కొలిక్కి వచ్చిన వెంటనే, మరొకట్రెండు రోజుల్లోనే అధికారికంగా పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live