Moto G37 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటొరోలా మళ్లీ స్పీడ్ పెంచింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కోరుకునే వారికోసం Moto G37 సిరీస్‌ను రంగంలోకి దింపుతోంది.
మే 19న మధ్యాహ్నం 12 గంటలకు Moto G37, Moto G37 Power ఫోన్లు భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నాయి. బడ్జెట్ ధరలో ఉన్నా.. ప్రీమియం లుక్‌తో వస్తున్న ఈ ఫోన్లు యువతను, ముఖ్యంగా గేమర్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
మూడ్రోజులు ఛార్జింగ్ అక్కర్లేదు:
ఈ కొత్త సిరీస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. Moto G37 Power మోడల్‌లో ఉన్న 7000mAh బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా మూడు రోజుల పాటు మొబైల్ వాడుకోవచ్చని కంపెనీ ధీమాగా చెబుతోంది. మాటిమాటికీ ఛార్జర్ పట్టుకుని తిరిగే అవసరం లేకుండా, ట్రావెలింగ్ చేసేవారికి ఇది సూపర్ ఆప్షన్ అవుతుంది. ఇక దీని 6.67 అంగుళాల పెద్ద స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్ ఫీలింగ్ కలుగుతుంది.
గోల్డెన్ ఛాన్స్ బ్రో.. రూ.12వేలు తగ్గిన Vivo Y400 ధర, నీటిలోనూ ఫొటోలు తీసే ఫీచర్లు దీని సొంతం!
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్:
మల్టీటాస్కింగ్ ఇష్టపడే వారి కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 5G ప్రాసెసర్‌ను వాడారు. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ మాత్రమే కాదు.. ఫోన్ వాడేటప్పుడు ఎక్కడా లాగ్ అవ్వదు. ఇక 12GB వరకు RAM సపోర్ట్ ఉండటంతో గేమింగ్ అద్భుతంగా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తోంది. అలాగే భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ కూడా ఇస్తామని కంపెనీ చెబుతోంది.
మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ:
ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది తక్కువ వెలుతురులో కూడా మంచి కలర్‌ఫుల్ ఫొటోలను తీస్తుంది. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. కేవలం ఫీచర్లు మాత్రమే కాదు.. ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకుంటే చాలా రిచ్‌గా అనిపించేలా వెనుక వైపు వీగన్ లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఫోన్ కిందపడినా త్వరగా పాడవకుండా మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో తయారు చేయడం విశేషం.
సేల్ ఎందులో అంటే?
సౌండ్ క్వాలిటీ కోసం డోల్బీ అట్మాస్ స్పీకర్లు, పాత హెడ్‌ఫోన్ల కోసం 3.5mm జాక్ కూడా ఇందులో ఉన్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అన్ని ఆఫ్‌లైన్ మొబైల్ షాపుల్లో కూడా అందుబాటులోకి వస్తాయి. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు కావాలనుకునే వారు కచ్చితంగా ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించవచ్చు.

