Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

Big TV Live 1 day ago

POCO X8 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ POCO X8 5G గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది. భారీ 8340mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 67W ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ హ్యాండ్‌సెట్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా నీటిలో కూడా ఫొటోలు తీయొచ్చని కంపెనీ చెబుతుండటం ఆసక్తికరంగా ఉంది. అయితే భారత్ కోసం రానున్న మోడల్‌లో బ్యాటరీని ఏకంగా 9000mAhకు పెంచే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

గ్లోబల్ మోడల్‌లో 8340mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. దీనికి 67W వైర్డ్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 1600 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80% వరకు ఆరోగ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. భారత్ వేరియంట్‌లో 9000mAh బ్యాటరీ వస్తే.. బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్‌కు మరింత పెద్ద ప్లస్‌గా మారొచ్చు.

1.5K AMOLED డిస్‌ప్లే:

ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల 1.5K అమోల్డ్ స్క్రీన్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సపోర్ట్, 12-bit కలర్ డెప్త్ దీనిలో ఉన్నాయి. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కూడా ఇచ్చారు. 3840Hz PWM డిమ్మింగ్ వల్ల తక్కువ బ్రైట్‌నెస్‌లో స్క్రీన్ వాడకం మరింత సౌకర్యంగా ఉండొచ్చు.

50MP కెమెరా.. నీటిలో ఫొటోలు:

వెనుక 50MP మెయిన్ కెమెరాకు OIS, EIS రెండూ ఉన్నాయి. దీనికి 2MP డెప్త్ సెన్సార్, ముందు 16MP కెమెరా ఉన్నాయి. అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ, డ్యూయల్ వీడియో, AI ఎడిటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉండటంతో నీరు, దుమ్ము విషయంలో మంచి రక్షణ లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్.. ఆండ్రాయిడ్ 16:

స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 12GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా హైపర్OS 3పై పనిచేస్తుంది. గ్లోబల్ మోడల్ ప్రారంభ ధర రూ.25,400. భారత మార్కెట్ ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సెప్టెంబర్ 4న లాంచ్ ఉంటుందని సమాచారం. 9000mAh బ్యాటరీ నిజమైతే.. ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది.

కలర్ ఆప్షన్స్ ఇవే:

కనెక్టివిటీ పరంగా కూడా ఫోన్‌లో లోటు లేదు. 5Gతో పాటు వైఫై 5, బ్లూటూత్ 5.1, NFC, GPS, గ్లోనాస్, USB టైప్-C, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ ఉన్నాయి. ఆఫ్‌లైన్ కమ్యూనికేషన్ ఫీచర్ కూడా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండొచ్చు. 223 గ్రాముల బరువుతో ఇది హెవీ ఫోన్. అయినా బ్యాటరీ కావాలనుకునే వారికి ఆ బరువు పెద్ద సమస్య కాకపోవచ్చు. గ్లోబల్‌గా బ్లాక్, ఆరెంట్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. 6GB/128GB, 8GB/256GB, 12GB/256GB వేరియంట్లు ఉన్నాయి. భారత్‌లో స్పెసిఫికేషన్లు, ధరను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live