Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

9020mAh బ్యాటరీ.. 90W ఫాస్ట్ ఛార్జింగ్, iQOO Z11 గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్!

Big TV Live 1 month ago

IQOO Z11: యువతలో iQOO బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ల కోసం చూసేవారికి ఇది ఫేవరెట్ బ్రాండ్.

ఇప్పుడు ఇదే కంపెనీ నుంచి iQOO Z11 అనే మరో క్రేజీ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. మలేషియాలోని వివో స్టోర్‌లో ఈ ఫోన్ వివరాలు కనిపించడంతో.. భారత్‌లోకి కూడా అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుందని అర్థమవుతోంది. మే 6న దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

వేగవంతమైన ప్రాసెసర్..

నాలో రిలీజ్ చేసిన వెర్షన్ కంటే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చే ఫోన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌ను వాడుతున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా, చాలా స్మూత్‌గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. వివో T5 ప్రో మోడల్‌ను కొద్దిగా మార్చి iQOO Z11 పేరుతో తీసుకొస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ప్రీమియం లుక్..

సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు డిస్‌ప్లే క్వాలిటీ బాగుండాలనే చాలామంది కోరుకుంటారు. అందుకే ఈ ఫోన్‌లో 6.83 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి తోడు 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్ ఆపరేటింగ్ గాలిలో తేలినట్టు స్మూత్‌గా ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ మాత్రం చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. పట్టుకుంటే ప్రీమియం లుక్ రావడం గ్యారెంటీ.

మోటరోలా, ఒప్పో ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏ మోడల్ ఎంత ధర తగ్గిందంటే?

బ్యాటరీ లైఫ్ ఎంతంటే?

ఈ ఫోన్‌లోని హైలైట్ ఏంటంటే.. దీని బ్యాటరీ కెపాసిటీ. ఏకంగా 9,020mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. రెండు మూడు రోజుల పాటు ఫోన్ ఛార్జ్ చేసే వసరమే ఉండదు. మళ్లీ ఆ భారీ బ్యాటరీని నిమిషాల్లో నింపడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. నీళ్లలో తడిచినా, దుమ్ము పడినా ఏమీ కాకుండా దీనికి పటిష్టమైన రక్షణ కూడా ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్..

ఈ iQOO Z11లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అలాగే దీనిలో OIS ఫీచర్ ఉండటం వల్ల నడుస్తూ వీడియోలు తీసినా లేదంటే ఫొటోలు తీసినా షేక్ అవ్వకుండా చాలా క్లియర్‌గా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. అలాగే లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో ఈ ఫోన్ పనిచేయడం మరో విశేషం.

ధర ఎంతంటే?

ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. 8GB, 12GB RAM ఆప్షన్లలో లభించనుంది. ఇక ధర విషయానికి వస్తే.. భారత్‌లో iQOO Z11 ఫోన్ ధర సుమారు రూ.25 వేల నుంచి రూ.35వేల మధ్య ఉండొచ్చని అంచనా. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Z11x కంటే ఇది పవర్‌ఫుల్‌గా ఉండటంతో.. కుర్రాళ్లంతా దీని కోసమే వెయిట్ చేస్తున్నారు.

అమెజాన్‌లో కనీవినీ ఎరుగని సూపర్ సేల్.. Galaxy S25 Ultraపై ఏకంగా రూ.35,000 ధర తగ్గింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live