Dailyhunt
ఆ డైరెక్టర్ ను ఇంటికి పిలిపించి మరి తిట్టిన అల్లు అర్జున్. ఇన్నాళ్లకు బయటపెట్టిన డైరెక్టర్?

ఆ డైరెక్టర్ ను ఇంటికి పిలిపించి మరి తిట్టిన అల్లు అర్జున్. ఇన్నాళ్లకు బయటపెట్టిన డైరెక్టర్?

Big TV Live 1 week ago

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ గురించి తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy)ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నందిని రెడ్డి త్వరలోనే సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 15వ తేదీ విడుదల కాబోతుందని తెలిపారు. కానీ వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి.

మొదటి సినిమాకే నంది అవార్డు..

ఇప్పటివరకు మా ఇంటి బంగారం సినిమా విడుదల వాయిదా గురించి చిత్ర బృందం అధికారకంగా వెల్లడించలేదు. ఇక ఇప్పటికే చిత్రబృందం పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నందిని రెడ్డి అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నందిని రెడ్డి అలా మొదలైంది సినిమా ద్వారా 2011వ సంవత్సరంలో ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఏకంగా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.

చివాట్లు పెట్టిన అల్లు అర్జున్..

ఈ సినిమా తర్వాత రెండు సంవత్సరాల పాటు కాస్త బ్రేక్ తీసుకున్న ఈమె సిద్దార్థ్ సమంత ప్రధాన పాత్రలలో నటించిన జబర్దస్త్ (Jabardasth)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో దాదాపు కొన్ని నెలలపాటు నందిని రెడ్డి ఇంటి నుంచి బయటకు కూడా రాలేదట. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ నందిని రెడ్డికి కబురు పంపడంతో ఆమె నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లానని తెలియజేశారు. ఇలా అల్లు అర్జున్ పిలవడంతో ఆయన ఇంటికి వెళ్ళగా తను మాత్రం దారుణంగా నన్ను తిట్టి పంపించారని గుర్తు చేసుకున్నారు.

ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే ఎలా?

అల్లు అర్జున్ పిలవడంతో నేను ఆయన ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే నీకు వచ్చిందే ఒకటే ప్లాప్ దానికోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటావా? నెక్స్ట్ సినిమా ప్లాన్స్ ఏంటి.. ఏదైనా కథ రాసావా? అంటూ వరుసగా ప్రశ్నలు వేశారు ఏదైనా కథ రాసి ఉంటే ఒక లైన్ నాకు నెరేట్ చెయ్యి అది ఎలా ఉందో నేను చెబుతాను. ఒక ఫ్లాప్ అయితేనే ఇంట్లో దాక్కొని కూర్చుంటే ఎలా అంటూ తనకు బాగా చివాట్లు పెడుతూనే తనని ప్రోత్సహించారని నందిని రెడ్డి అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. జబర్దస్త్ తర్వాత మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన ఈమె అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. అనంతరం ఓ బేబీ సినిమాతో మరో హిట్ కొట్టారు. ఇప్పుడు సమంతతో కలిసి మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live