Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ సంఘటన నన్ను మార్చేసింది.. విలన్ పాత్రల ప్రభావంపై బాలాజీ ఊహించని కామెంట్స్!

ఆ సంఘటన నన్ను మార్చేసింది.. విలన్ పాత్రల ప్రభావంపై బాలాజీ ఊహించని కామెంట్స్!

Big TV Live 1 week ago

Actor Balaji: బుల్లితెరపై నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న బాలాజీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా నటుడు బాలాజీ అనడం కంటే 'రేపుల బాలాజీ' అని చెబితే వెంటనే గుర్తుపట్టేస్తారు.

ఎక్కువగా తన సినిమాలలో అలాంటి పాత్రలతోనే ప్రేక్షకులను అలరించి రేపుల బాలాజీగా స్థిరపడిపోయారు. సినిమాలు, సీరియల్స్ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలాజీ.. 67 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన బాలాజీ..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ మొదట తన డైట్ సీక్రెట్ రివీల్ చేశారు. 67 సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం వెనుక తన డైట్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. “ప్రతిరోజు ఉదయం 4:00 గంటలకు నా దినచర్య ప్రారంభం అవుతుంది. రన్నింగ్ , జిమ్, యోగ , ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తాను . చలికాలంలో కూడా చన్నీటి స్నానాలు ఆచరిస్తాను. నేలపై పడుకోవడం నా అలవాటు . ఇక అంబలి రూపంలో గత కొన్ని దశాబ్దాలుగా రాగి సంగటిని ఉదయాన్నే తీసుకుంటాను. మాంసాహారాన్ని రెండు సంవత్సరాల క్రితమే మానేశాను” అంటూ తెలిపారు.

నా చెల్లి ఒక హీరోయిన్..నా తండ్రి కూడా నటుడే..

ఇదే ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ..” టాలీవుడ్ హీరోయిన్ రోహిణి నా సొంత చెల్లెలు. అలా మొదలైంది, బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా ఆమె నటించారు. ముఖ్యంగా దివంగత నటుడు రఘువరన్ భార్య” అంటూ తెలిపారు. అలాగే మాట్లాడుతూ.. “నా తండ్రి కూడా నటుడే. విఠలాచార్య గారి కోటలో పాగా చిత్రంలో రామకృష్ణతోపాటు సెకండ్ హీరోగా మా నాన్న చేశారు. రామానాయుడు గారి బంధువుల ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ఇక దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంలో సెకండ్ హీరోగా నా ప్రయాణం మొదలయ్యింది” అంటూ బాలాజీ తెలిపారు.

నా తేనే కళ్ళే నా కెరియర్కు పెద్ద ఆస్తి..

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” చిన్నప్పటి నుండే నటన పట్ల నాకు ఆసక్తి ఉండేది. ముఖ్యంగా నటనా రంగం వైపు మా నాన్న వ్యతిరేకించినా..ఆ తర్వాత ప్రోత్సహించారు. అయితే నా తేనె కళ్లు నా కెరియర్ కు పెద్ద అసెట్ గా నిలిచాయి. నా తేనె కళ్ళ వల్లే నాకు ఎక్కువగా విలన్ పాత్రలు లభించాయి. ఇక ప్రతి సినిమాలో కూడా హీరో చెల్లెల్ని రేప్ చేయడం లేదా హీరో చెల్లెల్ని ఇబ్బందులు పెట్టడం లేదా హీరో చెల్లెలు లేదా హీరోయిన్ బాత్రూంలో స్నానం చేస్తుంటే చూడడం ఇలా దాదాపు అన్ని పాత్రలు కూడా నాకు అలాగే వచ్చాయి. ఇక ఆ పాత్రల వల్లే నన్ను” రేపుల బాలాజీ” అని పిలవడం మొదలుపెట్టారు అంటూ తెలిపారు.

ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది..

సాధారణంగా హీరోలు బయట కనిపిస్తే వారితో ఫోటోలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని జనాలు ఎగబడతారు. నాకు కూడా జనాలలో తిరగడం ఇష్టం.. నలుగురితో మాట్లాడాలి.. నలుగురితో కలిసి నడవాలి అని నేను కోరుకుంటాను. కానీ నా క్యారెక్టర్ల వల్ల జనాలు నా దగ్గరికి వచ్చేవారు కాదు.. ఒకసారి నేను చెన్నైకి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక మహిళ తన పిల్లలను ఎత్తుకొని ట్రైన్ లో నా దగ్గరకు వచ్చింది. మీరు బాలాజీ కదా అని అడిగింది. అవునని చెప్పాను. మీతో కొన్నేళ్ళ క్రితమే మాట్లాడుదామని అనుకున్నాను. కానీ మీ విలన్ క్యారెక్టర్ల వల్ల భయమేసి నేను మీతో మాట్లాడలేకపోయాను అంటూ చెప్పిందని, అయితే తన పాత్రల తాలూకా ప్రభావం జనాలపై ఏ విధంగా పడిందో తనకు అర్థమైందని, ఆ ప్రభావం తనను నటుడిగా పరిపూర్ణం చేసిందని తనకు అర్థమైందంటూ బాలాజీ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించే పాత్రలే మనకు మంచి పేరు తీసుకొస్తాయని బాలాజీ తెలిపారు. విలన్ పాత్రలతో సరిపెట్టుకుంటున్నానేమో అని బాధపడిన ఆయనకు, ఆ ట్రైన్ ఇన్సిడెంట్ ఒక్కసారిగా తన ఆలోచనలను జీవితాన్నే మార్చేసింది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బాలాజీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live