Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆడపిల్లని తెలిస్తే చంపేస్తారా? సూర్యాపేట జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ రట్టు

ఆడపిల్లని తెలిస్తే చంపేస్తారా? సూర్యాపేట జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ రట్టు

Big TV Live 1 week ago

Gender Test: పిల్లల కోసం గుళ్లు, ఆస్పత్రులు తిరిగే వాళ్లు కొందరైతే.. పుట్టబోయే పిల్లలను కడుపులోనే చంపేసే వాళ్లు ఇంకొందరు.

అమ్మాయి అని తేలితే చాలు.. నెలలు నిండకుండానే నూరేళ్లు నిండిపోయేలా చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో బయటపడిన అక్రమ లింగ నిర్ధారణ సెంటర్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమలగిరిలోని బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం అందడంతో.. డీఎంహెచ్‌వో వెంకటరమణ, వైద్యాధికారులు తనిఖీలు చేశారు.

ఆస్పత్రిలో స్కానింగ్ మెషీన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రి అనుమతి గడువు ముగిసినా.. రెన్యూవల్ చేయనట్లు గుర్తించారు. ఆస్పత్రితో పాటు నిర్వాహకుడిపైనా కేసు నమోదు చేశారు. మొన్నటికి మొన్న జనగామలో అబార్షన్ వికటించి గర్భిణి చనిపోయింది. ఇప్పుడు సూర్యాపేటలో ఇలా! కఠిన చట్టాలున్నా వీళ్లకు బుద్ధి ఎందుకు రావట్లేదనేదే బిగ్ క్వశ్చన్. రోజుకో లింగ నిర్ధారణ సెంటర్ బయటకొస్తుంటే.. డీఎంహెచ్‌వోలు ఏం చేస్తున్నారు? అధికారులు సీరియస్‌గా ఉన్నట్లా? లేనట్లా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live