Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

Big TV Live 1 week ago

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యేందుకు ముహూర్తం ఖరారైంది.

ఆగస్టు 17 నుంచే ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ విమానయాన సంస్థ 'ఎయిరిండియా' ముందస్తుగా అక్టోబర్ 24 వరకు పనిచేసేలా తన ఫ్లైట్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఆగస్టు 17 నుంచి విమాన సేవలు

ఆగస్టు 17న భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి పూర్తిస్థాయిలో విమానాలు నింగికెగరనున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం, వ్యాపార రంగాలను పరుగులు పెట్టించేలా ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా ఎయిరిండియా ఆరంభంలోనే కీలక మార్గాల్లో భారీగా సర్వీసులను ప్లాన్ చేసింది.

ఏ నగరానికి ఎన్ని సర్వీసులు?

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ – భోగాపురం మధ్య రోజుకు ఏకంగా 5 సర్వీసులు నడపనున్నారు. విజయవాడ – భోగాపురం మధ్య రాష్ట్ర రాజధాని ప్రాంత అనుసంధానం కోసం రోజుకు 4 సర్వీసులు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే బెంగళూరు – భోగాపురం మార్గంలో ప్రతిరోజూ 2 సర్వీసులతో పాటు శుక్రవారం, ఆదివారం మినహా వారంలో మిగిలిన 5 రోజులు మరొక అదనపు సర్వీస్‌ను కూడా నడపడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రావడం వల్ల నిత్యం ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతగానో మేలు చేకూరనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live