Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

Big TV Live 2 weeks ago

Top 5 Student Tablets 2026: ప్రస్తుత డిజిటల్ ఎడ్యుకేషన్ ట్రెండ్‌లో విద్యార్థుల చదువు కేవలం పుస్తకాలకే.. పరిమితం కాలేదు. ఈ-బుక్స్ చదవడం, జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా ఆన్‌ లైన్ క్లాసులు వినడం, పీడీఎఫ్ నోట్స్..

తయారు చేసుకోవడం వంటి వాటికి ఒక మంచి ట్యాబ్లెట్ అత్యవసరం. అయితే.. మార్కెట్లో.. వేల రూపాయలు పెట్టి ప్రీమియం ట్యాబ్లెట్లు.. కొనడం ప్రతి స్టూడెంట్‌కు సాధ్యం కాదు. అందుకే.. స్టూడెంట్స్ బడ్జెట్ అవసరాలను.. దృష్టిలో ఉంచుకుని.. తక్కువ ధరలో ఎక్కువ కాలం పని చేసే.. బెస్ట్ 5 ట్యాబ్లెట్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా..

1. Lenovo Tab M11:

విద్యార్థుల ఫేవరెట్ బ్రాండ్లలో లెనోవో ఎప్పుడూ ముందుంటుంది. లెనోవో ట్యాబ్ ఎమ్11 అద్భుతమైన డిస్‌ప్లేతో.. పాటు స్టైలస్ పెన్ సపోర్ట్‌తో వస్తుంది. దీని ద్వారా నోట్స్ రాసుకోవడం చాలా ఈజీ. దీని పవర్ ఫుల్ బ్యాటరీ రోజంతా ఎలాంటి పని చేస్తుంది.

ధర: సుమారు రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది.

2. Xiaomi Pad SE:

షావోమి నుంచి వచ్చిన ఈ ట్యాబ్ బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. పెద్ద డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లు ఉండటం వల్ల ఆన్‌ లైన్ క్లాసులు వినేటప్పుడు.. కూడా సౌండ్ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ.12,999 నుంచి 14,999 మధ్య ఇది లభిస్తుంది.

3. Samsung Galaxy Tab A9 Plus:

బ్రాండ్ వాల్యూ, లాంగ్ లాస్టింగ్ పర్ఫామెన్స్ కోరుకునే.. స్టూడెంట్స్‌కు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది మల్టీటాస్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక వైపు క్లాసులు అటెండ్ అవుతూనే.. మరో వైపు నోట్స్ ఓపెన్ చేసుకోవచ్చు.

ధర: సుమారు రూ.16,999 నుంచి లభిస్తుంది.

4. Realme Pad 2:

స్లిమ్ డిజైన్, అల్ట్రా-ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌తో రియల్‌మి ప్యాడ్ 2 యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని పెద్ద స్క్రీన్ కంటికి ఒత్తిడి లేకుండా చూస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. ఇది చాలా గ్రేట్ పర్ఫార్మర్.

ధర:సుమారు రూ.17,999 వరకు ఉంటుంది.

రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!

5. Honor Pad X9:

తక్కువ బడ్జెట్‌లో 11.5 ఇంచుల పెద్ద 2K డిస్‌ప్లే కావాలనుకునే.. వారికి హానర్ ప్యాడ్ ఎక్స్9 అద్భుతమైన ఆప్షన్. దీనిలో ఉన్న 6 స్పీకర్ సెటప్ ఆడియో పరంగా అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే స్టూడెంట్స్‌కు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ట్యాబ్.

ధర: సుమారు రూ.13,999 నుంచి లభిస్తుంది.

మీ చదువును మరింత ఈజీ చేసుకోవడానికి మ, మీ బడ్జెట్ దాటకుండా ఉండేందుకు ఈ ట్యాబ్స్ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తాయి.ఇంకెందుకు ఆలస్యం మీ అవసరాలకు తగిన ఒక ట్యాబ్‌ను వెంటనే.. ఆర్డర్ చేసేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live