Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్  సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

Big TV Live 3 days ago

Ayodhya Ram Mandir: వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రామ్‌మందిర్ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది యోగీ సర్కార్.

రామ మందిర ట్రస్ట్ తొలిసారి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఎలా ఎంపిక చేసింది? వైమానిక విభాగం నుండి పదవీ విరమణ చేసిన కొద్దినెలలకు రామ మందిర పరిపాలనను పర్యవేక్షించే బాధ్యతను ఎలా అప్పగించారు? జితేంద్ర మిశ్రా ఎంపిక కేవలం ఆపరేషన్ సింధూర్ వల్ల జరగలేదా? దీని వెనుకున్న రాజకీయాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

రామ్ మందిర్ కొత్త సీఈఓగా జితేంద్రమిశ్రా

ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా. ఆ ఆపరేషన్‌లో ఆయన పోషించిన పాత్రకు గుర్తింపు లభించింది. అంతేకాదు అత్యున్నత యుద్ధ సేవా పతకాన్ని అందుకున్నారు. వైమానిక దళం నుండి పదవీ విరమణ చేసిన కొద్ది నెలలకు రామ మందిర్ ట్రస్టు సీఈఓగా ఎంపికయ్యారు. జితేంద్ర మిశ్రా ఎంపిక ‘ఆపరేషన్ సింధూర్’ వల్ల జరగలేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయనకు వైమానిక విభాగంలో పని చేయడం, స్వచ్ఛమైన వృత్తిపరమైన ప్రతిబింబం, ఉత్తర ప్రదేశ్‌తో ఆయనకు ఉన్న అనుబంధం వంటి ముఖ్యమైన అంశాలుగా చెబుతున్నారు.

సీఈఓ పదవికి జరిగిన ఇంటర్వ్యూలో ఏం జరిగింది?

రామ మందిర్ ట్రస్టు సీఈఓ పదవి కోసం చర్చించిన పేర్లలో జితేంద్ర మిశ్రా పేరు లేదు. జితేంద్ర మిశ్రా మొదటి నుంచి ప్రధాన పోటీదారు రేసులో లేరు. సీఈఓ పదవి కోసం జరిగిన ప్రాథమిక చర్చల్లో మాజీ ఐఏఎస్‌లు యోగేశ్వర్ రామ్‌ మిశ్రా, రాజేష్ పాండే, దినేష్ సింగ్, బీహార్ కేడర్ ఐపీఎస్ డాక్టర్ పరేష్ సక్సేనా వంటి పేర్లు బలంగా వినిపించాయి. ప్రాథమిక చర్చల్లో జితేంద్ర మిశ్రా పేరు రాలేదు. ఆ తర్వాత ట్రస్ట్.. ఆ పదవికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది. మొత్తం 16 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూల తర్వాత మూడు పేర్లతో కూడిన ఓ ప్యానెల్‌ను రూపొందించారు. ఈ ప్యానెల్‌లో జితేంద్ర మిశ్రా పేరు తెరపైకి వచ్చింది. చివరికి ట్రస్ట్ ఆయన పేరును ఆమోదించింది. ప్రాథమిక ఎంపికలో జిత్రేంద్ర పేరు లేనప్పటికీ, ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్న తర్వాత ఆయన సీఈఓగా ఎంపికయ్యారు.

ఆపరేషన్ సిందూర్‌తో ఆయనకున్న సంబంధమేంటి?

ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు జితేంద్ర మిశ్రా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. ఆపరేషన్ సమయంలో వెస్ట్రన్ ఫ్రంట్‌లోని వైమానిక దళానికి ఆయన కీలక బాధ్యత వహించారు. మే 13న ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆడంపూర్ వైమానిక స్థావరానికి వచ్చినప్పుడు జితేంద్ర మిశ్రా స్వాగతం పలికారు. ఆపరేషన్‌లో ఆయన పాత్రను దృష్టిలో పెట్టుకుంది ప్రభుత్వం. జితేంద్ర మిశ్రా చేసిన సైనిక సేవలకు అత్యున్నత యుద్ధ సేవా పతకాన్ని అందుకున్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే రామ మందిర ట్రస్ట్‌కు సీఈఓగా ఎంపిక చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన చూపిన నాయకత్వం, ఆయన ఎంపికలో కీలక అంశంగా చెబుతున్నారు.

టెంపుల్ నిర్వహణ నార్మల్ విషయం కాదు

రెండోది.. రామ మందిరాన్ని ఇప్పుడు ఒక దేవాలయంగా చూడలేదు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. దానికి సంబంధించిన పనులు, ఏర్పాట్లు, రాబోయే ప్రాజెక్టులు, మొత్తం సముదాయ నిర్వహణ పరిధి విస్తరిస్తోంది. భారీ స్థాయి కార్యకలాపాలను నిర్వహించడంలో విభిన్న బృందాలతో కలిసి పని చేయడంలో అనుభవం ఉన్న వ్యక్తి ట్రస్ట్‌కు అవసరం. క్రమశిక్షణ, పనులను సకాలంలో పూర్తి చేయడం, క్లిష్ట పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి సైనిక సేవలోని రోజువారీ బాధ్యతలలో భాగం. ఈ అనుభవం సీఈఓ పాత్రలో ఉపయోగపడుతుందని భావించారు. జితేంద్ర మిశ్రా పరిపాలన, నాయకత్వ అనుభవం రామ మందిర్ ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని ట్రస్ట్ ఆశిస్తోంది.

యూపీలో జిత్రేంద్రకు అనుబంధం

మూడవ కారణం జితేంద్ర మిశ్రాకు యూపీతో అనుబంధం ఉంది. ఆయన డియోరియాకు ప్రాంతానికి చెందినవారు. ఆయన ఎంపిక యూపీతో ఉన్న అనుబంధాన్ని ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నారు. ఆయనకు జాతీయ భద్రతలో విస్తృతమైన అనుభవం ఉంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌తో సంబంధాలు ఉన్నాయి. కొత్త ట్రస్ట్ ఏర్పాటులో ఈ రెండు ఉపయోగపడవచ్చని ట్రస్టు అంచనా. ఆయన ఎంపికను సైనిక నేపథ్యంగా చూడటం లేదు. రామ మందిర ట్రస్ట్‌లో తొలిసారి సీఈఓ పదవిని సృష్టించారు. ఆలయ కార్యకలాపాల పరిధి నిరంతరం విస్తరించడం కీలకంగా భావించారు. రోజువారీ పరిపాలన-ప్రధాన ప్రాజెక్టుల మధ్య సమన్వయం కొనసాగించడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఆయన ఎంపిక జరిగిందని అంటున్నారు.

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAILలో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రెండు వేల మంది ఉద్యోగులు మందిర్ పర్యవేక్షణ, ఆలయ భద్రత, పరిశుభ్రత, నిర్వహణ కోసం పర్యవేక్షిస్తారు. ట్రస్ట్ తీసుకునే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. భక్తుల సౌకర్యం, లక్షలాది భక్తులకు సులభంగా దర్శనం కల్పించడం, పండుగల వేళ పోలీసు-పరిపాలనా యంత్రాంగాలతో కలిసి రాకపోకల ప్రణాళికలను రూపొందించడం, ట్రస్ట్ బోర్డు- ప్రభుత్వం మధ్య సమన్వయం వంటి అంశాలు సీఈఓ, ట్రస్ట్ బోర్డు, ఛైర్మన్‌కు అధీనంలో ఉంటారు. వారంతా ట్రస్ట్- రాష్ట్ర ప్రభుత్వం-పోలీసులు-పాలన మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రస్ట్ వార్షిక ఖాతాలను ఒక్కసారి చూద్దాం. ఈ ఏడాది ట్రస్ట్ సుమారుగా రూ. 237 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అందులో ఖర్చులు మొత్తం రూ. 91 కోట్లు, నిర్మాణం సహా వివిధ ప్రాజెక్టులపై సుమారుగా రూ. 425 కోట్లు ఖర్చు చేసినట్లు ఉంది. మార్చి 21, 2026 నాటికి ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలో సుమారు రూ. 1,882 కోట్లు ఉన్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live