Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

Big TV Live 2 weeks ago

Art director Anand Sai:చిత్ర సీమలో మరో ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆర్ట్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆనంద్ సాయి (Anand Sai) కొడుకును పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకును పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? అసలు ఏం జరిగింది ? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించడం ఏంటి? అసలు ఆయన స్పందిస్తారా? ఆయనకు ఈ విషయానికి గల సంబంధం ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్..

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆర్కిటెక్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. యాదాద్రి పునర్నిర్మాణంలో రూపకర్తగా వ్యవహరించారు. ఎన్నో ఆలయాలకు నమూనాలు కూడా గీసారు. భారీ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా పనిచేస్తున్నారు. ఈయన కొడుకు సందీప్ (Sandeep) ను పోలీసులు అరెస్ట్ చేశారు.. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్..

మరి సందీప్ అరెస్టు వెనక గల కారణం ఏమిటి? అనే విషయానికొస్తే.. సందీప్ ఇటీవల యాక్సిడెంట్ చేసి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసుల అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ యాక్సిడెంట్ పై విచారణ జరుపుతుండగా.. ఈ హిట్ అండ్ రన్ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సందీప్ ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్ట్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కు 30 ఏళ్ల అనుబంధం..

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ముఖ్యంగా వీరిద్దరూ ఎంతో కాలంగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. పైగా 30ఏళ్ల స్నేహం వీరిది.

పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్.. ప్రాణ స్నేహితుడి కొడుకు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోవడం తో ఈ విషయంపై స్పందిస్తారా? తన పవర్ ను ఉపయోగించి బయటకు తీసుకొస్తారా? లేక న్యాయం కోసం స్నేహితుడికి నచ్చ చెబుతారా? అనే విషయంపై సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఆర్ట్ డైరెక్టర్ కొడుకు సందీప్ కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సినిమాలు..

తొలిప్రేమ, యమదొంగ, సైనికుడు, గుడుంబా శంకర్ , బాలు, ఎవడు ఇలా పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. తొలిప్రేమ సినిమాతో ఆర్ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన .. ఆ సినిమాలో సముద్రపు గట్టున రూపొందించిన తాజ్ మహల్ సెట్ కి ఈయనకు మంచి పేరు లభించింది. ఆ తర్వాత పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live