Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!

ఆస్తులు కూడగట్టాలనే పేరాశ ..నిన్ను ఒంటరిని చేసే మహేశా!

Big TV Live 2 days ago

హేశ్ కుమార్ గౌడ్… ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. పార్టీలో చాలా రోజులుగా తనకు మంచి అవకాశం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. ఓపిక పట్టారు. అప్పటి చాలా సార్లు పార్టీ ఆయన్ను ఎంకరేజ్ చేసింది.

క్రమంగా ఆయన ప్రజాక్షేత్రం నుంచి దూరమవుతూ వచ్చారు. జనంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోయాడు. కానీ చీకట్లో చిరు దీపంలా ఆయనక మళ్లీ పీసీసీ చీఫ్ పదవి రూపంలో అధిష్టానం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇది ఆయన కూడా ఊహించుకోని పరిణామం.

కారం మెతులకు కూడా మోతాదు అన్నట్టుగా ఉన్న మహేశ్‌కు ఏకంగా.. పంచభక్ష పరమాన్నాలు పెట్టింది అధిష్టానం. కానీ ఆయన తనకిచ్చిన ఈ మహదావకాశాన్ని పార్టీ ఎదుగుదలకు, పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేస్తున్న కార్యకర్తలకు, నేతలను ఆదుకుని వారిని బలోపేతం చేసే దిశగా మాత్రం ఆలోచలను చేయలేదు. ఊరించి ఊరించి తన చుట్టూ తిప్పించుకుని లైన్‌లో ఉంచుకుని వారిని ఆశల పల్లకిలో ఊరేగించేందుకే ఎక్కువ ఇంట్రస్టు చూపారు. ఈ విషయంలో ఆయన తనలో అంతర్గతంగా ఉన్న సైకో లక్షణాలను కూడా చాలా సార్లు బయట పెట్టుకున్నారు.

మహేశ్ గౌడ్‌కు ఒకటే ఆశ ఎప్పుడూ నిలకడగా ఉండనిచ్చేది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందంగా.. అవకాశం ఉన్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలని. ఇది ఒక్క మహేశ్ కుమార్ గౌడ్‌కే లేదు… చాలా మంది కాంగ్రెస్ నేతలు ఇలాగే ఆలోచించి బొక్కబోర్లా పడ్డారు. విపరీతంగా డబ్బులు సంపాదించాలని అత్యాశ వారి నాయకత్తానికే సవాల్‌గా మారింది. కాంట్రాక్టు బిల్లుల్లో పర్సెంటేజీ తీసుకుని బిల్లులు రిలీజ్ చేసిన కీలకమైన ఓ దళిత మంత్రి కూడా బద్నాం అయిన విషయం తెలిసిందే. ఇదే కోవలోకి చేరాడు మహేశ్‌.

ఎవరైనా తన వద్దకు వస్తే… వందల కోట్ల భూముల లావాదేవీలుంటే తీసుకురావాలని, ఇలా చిన్న చిన్న పంచాయతీలు… వద్దు అనే విధంగా ఆయన మాట్లాడిన తీరు.. మహేశ్‌లో ఎంతటి పేరాశ పెరిగిపోయిందో అర్థమవుతుంది. డబ్బులు సంపాదించుకుని, వేల కోట్లు పోగేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు రాజకీయాన్ని పదిలం చేసుకోవాలనే ఆలోచనే తప్ప.. తాను రెండేండ్లుగా పీసీసీ చీఫ్‌గా పార్టీకి, పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నాననే ప్రాక్టికల్ థింకింగ్‌కు మాత్రం బహుదూరం పాటించాడు. పర్యవసానంగా ఆయన డబ్బు మనిషిగా ముద్రపడ్డాడు.

గతంలో డీఎస్ కూడా ఇలాగే చేసేవాడనే ప్రచారం ఉంది. ఏ పని చేసినా దానికి డబ్బే ప్రధానమై ఉండేదనే ఆరోపణలున్నాయి. సేమ్ తన గురువు పంథాలోనే శిష్యుడు పోయినట్టుగా అర్థమవుతోంది. ఈ డబ్బు పేరాశతో ఆయన తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు చేసుకున్నాడనే విమర్శను మూటగట్టుకున్నారు. వీటి పర్యవసానాలన్నీ త్వరలో మహేశ్ ఎదుర్కోబోతున్నట్టుగా అనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live