Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది శిశువులు మృతి, ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోరం

Big TV Live 2 months ago

Hospital Accident: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలం ఆసుపత్రిలో ఆగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మహారాష్ట్ర కాగా, నేడు ఇస్లామాబాద్ వంతైంది.

ఇస్లామాబాద్‌లోని అతి పెద్ద ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది?

ఇస్లామాబాద్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. పాక్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-పిమ్స్‌లోని గైనకాలజీ వార్డులో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలింది. ఈ ఘటనలో గైనకాలజీ వార్డులో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఆసుపత్రిని కమ్మేశాయి.

ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ఎంసీహెచ్ వార్డు మూడవ అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది చిన్నారుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం తెలిపింది. కేవలం ఒక పసికందుని సిబ్బంది కాపాడారు. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

15 మంది శిశువులు మృతి, విచారణ మొదలు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక-సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతుల సంఖ్యపై అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మంది పేర్కొన్నారు. ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మృతి చెందినట్టు పేర్కొన్నాయి.

ఈ ఘటన తర్వాత ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. నవజాత శిశువుల మృతితో కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనకు గల కారణాలు, నిర్లక్ష్యం ఉందేమోనని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం అదనపు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని కనుగొనడంతోపాటు, ఆసుపత్రి భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేయనుంది.

ఇరాన్ పై అమెరికా ఉక్కుపాదం.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఎత్తులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live