Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అది నా "హ్యాపీ ప్లేస్".. త్రిష పోస్ట్ వైరల్!

అది నా "హ్యాపీ ప్లేస్".. త్రిష పోస్ట్ వైరల్!

Big TV Live 3 weeks ago

Trisha Krishnan: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా ఇప్పటికీ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు నటిగా బిజీగా మారిన ఈమె.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ అభిమానులను సంతోషపరుస్తోంది. “అది నా హ్యాపీ ప్లేస్” అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అది నా హ్యాపీ ప్లేస్ – త్రిష

అసలు విషయంలోకి వెళ్తే.. మే 4వ తేదీన త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించిన ఆమె.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ వాటిపైన అది నా హ్యాపీ ప్లేస్ అంటూ పంచుకుంది. ప్రస్తుతం త్రిష పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే త్రిష కి సెలబ్రిటీల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వీరిందరికీ ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ..” మీ అందరి ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలినై ఉంటాను” అంటూ త్రిష తెలిపింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ విక్టరీ.. వెలుగులోకి త్రిష..

ఇదిలా ఉండగా విజయ్ దళపతి 2024లో టీవీకే అనే పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాడు. 234 స్థానాలకు గానూ 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచారు. అయితే విజయ్ విజయానికి కారణం త్రిష అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. త్రిష వెన్నంటి నడిపించిందని అటు మే 4వ తేదీన తిరుపతికి వెళ్లడానికి కూడా విజయ్ విజయం సాధించాలని శ్రీవారిని మొక్కుకోవడానికి వెళ్లిందని కామెంట్లు కూడా చేశారు . అలా మొత్తానికి అయితే విజయ్ విక్టరీలో త్రిష భాగం చాలా ఉందని నెటిజన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వేణు 'ఎల్లమ్మ'లో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన దేవిశ్రీప్రసాద్!

సెలబ్రిటీస్ స్పెషల్ విషెస్..

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీలు కూడా త్రిషకి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో వరలక్ష్మి శరత్ కుమార్..” ఈ పుట్టినరోజు నీకు బెస్ట్ బర్తడే” అని పోస్ట్ పెట్టగా.. రాధిక కూడా “హ్యాపీ బర్తడే.. వాట్ ఏ గిఫ్ట్” అంటూ లవ్ ఎమోజీలు పంచుకుంది మంచు లక్ష్మీ. “ఈ యూనివర్స్ మంచి గిఫ్ట్ అందించింది” అని కామెంట్ చేయగా.. అటు ఛార్మీ కూడా” ఈ పుట్టినరోజు నీకు చిరస్థాయిలో నిలిచిపోతుంది” అంటూ విష్ చేసింది. బండ్ల గణేష్ కూడా “మీ కలలన్నీ నెరవేరాయి” అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి అయితే విజయ్ దళపతి టీవీకే పార్టీ మంచి విజయం సొంతం చేసుకోవడంతో అటు అదే రోజు ఆమె పుట్టిన రోజు కూడా కావడంతో రెండింటికి సింక్ అయ్యేలా సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live