Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Admissions: జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు..  6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

Admissions: జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు.. 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

Big TV Live 1 week ago

Admissions: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త.2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్లకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రవేశ పరీక్ష కు సంబంధించి అర్హత గల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ పాఠశాలల అడ్మిషన్లు

2027-28 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల జూలై 31 వరకు అవకాశం ఉంది. ఐదో తరగతి పూర్తయినవారు, ప్రస్తుతం ఐదు చదువుతున్నవారు అర్హులు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. వాటి ఫలితాలను మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదల చేస్తారు అధికారులు.

ప్రవేశాలకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయాల్లో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులు ఇంటర్ వరకు చదువుకునే సువర్ణావకాశం. చదువుతోపాటు ఆటలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌-15, తెలంగాణ-9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.

6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి 80 మంది విద్యార్థులకు తీసుకుంటారు. అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే ఉంటుంది. ప్రవేశం కోరే విద్యార్థులు సొంత జిల్లాలో ప్రస్తుత చదువుతున్నవారై ఉండాలి.ఈ పరీక్ష రాయడానికి విద్యార్థులకు ఒక్కసారి మాత్రమే అర్హత ఉంటుంది. 75 శాతం సీట్లు రూరల్ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు. 25 శాతం సీట్ల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు.

రూరల్ కోటాలో సీటు కోసం పోటీ పడే విద్యార్థులు 3, 4, 5 తరగతులను గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలు, ఏదైనా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదివి ఉండాలి. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించనున్నారు. ఎస్టీలు-7.5, ఎస్సీలు- 15, ఓబీసీలు-27 శాతం, వికలాంగులకు కొన్ని సీట్లు ఉంటాయి. ఇక ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. రెండు గంటలపాటు పరీక్ష ఉంటుంది.

అయోధ్యలో రూ. 5 కోట్ల బంగారు పుస్తకం మాయం? అసలు నిజం బయటపెట్టిన రామాలయ ట్రస్ట్

పరీక్షలో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, ఆర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు వారు కోరుకున్న హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమంలో పరీక్ష రాయవచ్చు. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్ సంప్రదించాలి. navodaya.gov.in, cbseitms.rcil.gov.in ఒక్కసారి చెక్ చేయండి ను సంప్రదించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live