Dailyhunt
ఐఫోన్ రేంజ్ కెమెరా, సూపర్ స్పీడ్.. ఈ Vivo S50t ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

ఐఫోన్ రేంజ్ కెమెరా, సూపర్ స్పీడ్.. ఈ Vivo S50t ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Big TV Live 1 week ago

Vivo S50t 5G: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. చైనాలో సైలెంట్‌గా Vivo S50t అనే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. నిజానికి ఇది గతేడాది చివర్లో వచ్చిన S50 మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్.

అయితే.. సామాన్యుల కోసం స్టోరేజ్ స్పీడ్‌లో చిన్న మార్పు చేసి, ధరను కాస్త తగ్గించి మార్కెట్లోకి వదిలారు. చూడటానికి మాత్రం అచ్చం దానిలాగే ఉంటుంది కానీ, తక్కువ ధరలో మంచి ప్యాకేజీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

వివో ఫోన్లంటేనే డిజైన్ పరంగా ఒక రేంజ్‌లో ఉంటాయి. ఈ S50t కూడా చాలా స్లిమ్‌గా, చేతిలో పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. వెనుక వైపు గ్లాస్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్ ఇచ్చారు. ఇక స్క్రీన్ విషయానికి వస్తే.. 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. సినిమా చూసినా, గేమ్ ఆడినా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అలాగే కళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన టెక్నాలజీని కూడా దీనిలో వాడారు.

10x జూమ్, పిచ్చెక్కించే క్లారిటీ.. Huawei Mate 90 Pro Max కెమెరా సెటప్ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 అనే పవర్‌ఫుల్ చిప్‌సెట్ వాడారు. దీనివల్ల ఫోన్ లాగ్ అవ్వదు. స్టోరేజ్ స్పీడ్ కొంచెం తగ్గించినా.. రోజువారీ పనుల్లో ఆ తేడా అస్సలు తెలియదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో పని చేసే ఆరిజిన్ ఓఎస్ దీనిలో ఉండటం విశేషం. 12GB, 16GB RAM ఆప్షన్స్ ఉండటం వల్ల ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా ఫోన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది.

ఇకపోతే కెమెరాల విషయంలో వివో ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు దూరం ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా తీయడానికి 50MP టెలిఫోటో లెన్స్‌ను కూడా ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం కూడా 50MP కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో 6,500mAh భారీ బ్యాటరీని అమర్చడమే కాకుండా.. 90W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నిమిషాల్లో ఫోన్ ఫుల్ అయిపోతుంది.

ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ 12GB+512GB మోడల్ ధర రూ.38,000 వరకు ఉంది. ఇండియాకు వచ్చేసరికి స్పేస్ బ్లాక్, ఇన్సిపిరేషన్ పర్పుల్ లాంటి 4 కలర్స్‌లో ఇది దొరుకుతుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. ఒక మంచి కెమెరా ఫోన్ అది కూడా బడ్జెట్‌లో కావాలనుకునే వారికి ఈ Vivo S50t మంచి డీల్.

యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. అదిరిపోయే డిజైన్‌తో ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్, ఆ 11 రంగుల ప్రత్యేకత ఏమిటంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live