Dailyhunt
ఐప్యాడ్ రోజులు పోయాయ్.. ఇప్పుడు మార్కెట్లో ఈ టాప్-5 ఆండ్రాయిడ్‌ టాబ్లెట్లదే హవా!

ఐప్యాడ్ రోజులు పోయాయ్.. ఇప్పుడు మార్కెట్లో ఈ టాప్-5 ఆండ్రాయిడ్‌ టాబ్లెట్లదే హవా!

Big TV Live 2 weeks ago

Best Android Tablets 2026: సాధారణంగా టాబ్లెట్ అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఐప్యాడ్. ఆ బ్రాండ్ మీద ఉన్న క్రేజ్ అలాంటిది మరి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.

ఆండ్రాయిడ్ టాబ్లెట్లు కూడా ఐప్యాడ్‌లకు ఏమాత్రం తీసిపోకుండా మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ముఖ్యంగా శాంసంగ్, వన్‌ప్లస్ లాంటి కంపెనీలు లాప్‌టాప్‌తో పని లేకుండానే అన్ని పనులను చక్కబెట్టేలా అదిరిపోయే ట్యాబ్‌లను తీసుకొస్తున్నాయి. మీరు కూడా ఒక మంచి ఆండ్రాయిడ్ టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రస్తుతం టాప్ రేటింగ్‌లో ఉన్న ఈ 5 ఆప్షన్లపై ఓ లుక్కేయండి.

Xiaomi Pad 8

ఐప్యాడ్ ఎయిర్ లాంటి లుక్ ఉండాలి.. కానీ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే షావోమీ ప్యాడ్ 8 బెస్ట్ ఛాయిస్. ఇది ఫుల్ మెటల్ బాడీతో చూడటానికి చాలా క్లాస్‌గా ఉంటుంది. 11.2 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో దీని పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. దీనిలో 12GB వరకు RAM ఉంటుంది కాబట్టి.. ఎంతటి హెవీ గేమింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా అస్సలు హ్యాంగ్ అవ్వదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి సెట్ అవుతుంది.

OnePlus Pad Go 2

బడ్జెట్ మరీ ఎక్కువ పెట్టలేము.. అలా అని ఫీచర్లు తక్కువ ఉండకూడదు అనుకునే వారికి వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 బెటర్. దీనిలో 12.1 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుంది. దీనివల్ల సినిమాలు చూడటానికైనా, ఆన్‌లైన్ క్లాసులు వినడానికైనా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్యాబ్‌లో 10,050mAh భారీ బ్యాటరీ ఉంది కాబట్టి.. ఛార్జింగ్ గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. స్టూడెంట్స్‌కు ఇది చాలా బాగా ఉపయోగకరం.

వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. 8000mAh బ్యాటరీతో నార్డ్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!

Redmi Pad 2 Pro

రూ.25వేల లోపు మంచి ట్యాబ్ కోసం చూస్తున్నట్టయితే.. రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రోను ఎంపిక చేసుకోవచ్చు. దీనిలో హైలైట్ ఏమిటంటే.. ఇందులో ఏకంగా 12,000mAh బ్యాటరీని అమర్చారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్‌తో రోజువారీ పనులు, వీడియోలు చూడటం లాంటివి చాలా స్మూత్‌గా జరిగిపోతాయి. బడ్జెట్ రేంజ్‌లో ఇది నిజంగా వాల్యూ ఫర్ మనీ అనే చెప్పాలి.

Samsung S11 Ultra

కాస్త ధర ఎక్కువ ఉన్నా పర్లేదు.. ఫీచర్లు మాత్రం అదిరిపోవాలి అనుకునే వారి కోసం శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్11 అల్ట్రా బెస్ట్ ఆప్షన్. దీనిలో AI వాడకం చాలా బాగుంటుంది. ఈ ట్యాబ్‌లో మనం ఏదైనా రాస్తున్నా లేదంటే డ్రాయింగ్ వేస్తున్నా ఏఐ హెల్ప్ తీసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో ఇది సూపర్ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ఆఫీస్ వర్క్ చేసే వారికి, క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఇదొక మినీ లాప్‌టాప్ లాంటిదే.

Oneplus Pad 3

ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3లో ఏకంగా 13.2 అంగుళాల భారీ స్క్రీన్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండటం వల్ల దీని స్పీడ్ కూడా బాగుంటుంది. ఎంత పెద్ద యాప్స్ అయినా ఇట్టే వాడేయొచ్చు. కలర్ ఓఎస్ 15 తో దీని ఇంటర్‌ఫేస్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. గేమింగ్ ఎక్కువగా ఆడేవారు, బిగ్ స్క్రీన్‌ను ఇష్టపడేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live