IND VS IRE: ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC T20 World Cup 2026 tournament) గెలుచుకున్న టీమిండియా కు పసికూన ఐర్లాండ్ ఝలక్ ఇచ్చింది.
అందరూ ఊహించినట్లుగానే రెండో టి20లో కూడా టీం ఇండియాను ఓడించి… వైట్ వాష్ చేసింది ఐర్లాండ్. మొదటి టీ20లో అన్ని రంగాల్లో రాణించిన ఐర్లాండ్… సెకండ్ మ్యాచ్ లో కూడా అదే ఫార్ములా అప్లై చేసింది. ఈ క్రమంలో 2-0 తేడాతో టీమిండియాను వైట్ వాష్ చేసింది పసి కూన ఐర్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడించింది ఇండియాకు సంబంధించిన జై మూండ్రా. రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన జై మూండ్రా, ఐర్లాండ్ క్రికెట్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టీమిండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించినందుకు అతడికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. దీంతో జై మూండ్రా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇంతకు ఎవరీ జై మూండ్రా.. ఐర్లాండ్ కు ఎందుకు ఆడుతున్నాడు ?
ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ (Ireland vs India, 2nd T20I) నేపథ్యంలో టీమిండియాను ఓడించింది ఒక భారతీయుడు కావడం గమనార్హం. అతడే జై మూండ్రా (Jai Moondra). లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేయగల జై మూండ్రా… రాజస్థాన్ రాష్ట్రంలోని టోన్ ఏరియాలో జన్మించారు. చిన్న తనంలోనే క్రికెట్ మొదలుపెట్టిన జై మూండ్రా, 2021 సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్ చేయడానికి ఐర్లాండ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే అక్కడ కూడా క్రికెట్ పైన ఫోకస్ చేసిన జై మూండ్రా, దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించాడు. అక్కడ పోటీ తక్కువ ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ ఐర్లాండ్ జట్టులోకి వచ్చి.. ఇప్పుడు అదరగొడుతున్నాడు. టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన రెండు టీ20 నేపద్యంలో మొత్తం ఐదు వికెట్లు తీశాడు జై ముండ్రా. మొదటి మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన జై ముండ్రా, రెండో టి20 లో సంజు, అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా ఇతడికే దక్కింది. దీంతో ఓ భారతీయుడే.. టీమిండియా జట్టును ఓడించినట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
రాజస్థాన్ రాష్ట్రంలో సంబరాలు
ఐర్లాండ్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జై మూండ్రా, టీమిండియాను ఓడించాడు. ఈ క్రమంలో రాజస్థాన్ తో ఉన్న జై మూండ్రా ఫ్యామిలీ… టీవీ చూస్తూ సంబరాలు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకవేళ గా మారింది.

