Action Thriller Web Series on OTT : మనీ హైస్ట్ సిరీస్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక్క సారి చూడటం మొదలు పెడితే చూపుకూడా తిప్పుకోలేం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పక్కా హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.
ఇందులో బెర్లిన్ సిండికేట్, వియెన్నా మాఫియా, ఫ్రెంచ్ గ్యాంగ్స్ లాంటి అంతర్జాతీయ నేరగాళ్ల మధ్య జరిగే గ్యాంగ్ వార్స్, చేజింగ్‌లు ప్రేక్షకుడికి మైండ్ బ్లోయింగ్ థ్రిల్‌ను ఇస్తాయి. ఈ సిరీస్‌లో బలమైన ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. తన భార్యాపిల్లలను ఎలాగైనా కాపాడుకోవాలని తపించే ఒక తండ్రి ఆరాటం చాలా గ్రిప్పింగ్‌గా చూపించిన సిరీస్ ఇది. సస్పెన్స్ ఇంకా క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ వాచ్ గా చెప్పుకోవచ్చు దీనిని.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
2024లో వచ్చిన ఈ జర్మన్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘క్రూక్స్’ (Crooks). మార్విన్ క్రెన్ ఈ సిరీస్ ను సృష్టించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2024 ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదలై అంతర్జాతీయంగా భారీ ఆదరణ పొందింది. ఇందులో ఫ్రెడరిక్ లా (చార్లీగా), క్రిస్టోఫ్ క్రుట్జ్లర్ (జోసెఫ్‌గా) ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ రెస్పాన్స్ కారణంగా రెండవ సీజన్‌కు కూడా రూపొందింది. సీజన్ 2 ఇటీవల 2026 ఏప్రిల్ 14న విడుదలైంది. ఇందులో చార్లీ, జోసెఫ్‌ల ప్రయాణం బ్యాంకాక్ వంటి కొత్త నగరాలకు విస్తరించి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ సిరీస్ ప్రస్తుతం జర్మన్ భాషతో పాటు ఇంగ్లీష్, హిందీ డబ్బింగ్ ఆడియోలతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
స్టోరీ ఏమిటంటే
ఈ కథ ఒక మాజీ దొంగ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. చార్లీ అనే ఒకప్పటి దొంగ, తప్పులన్నీ మానేసి బెర్లిన్‌లో భార్యాపిల్లలతో ప్రశాంతంగా బతుకుతుంటాడు. అయితే అతని పాత క్రిమినల్ గ్యాంగ్ ఊరుకోకుండా మళ్లీ ఎంటరై, ఒక అరుదైన బంగారు నాణేన్ని దొంగిలించమని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో చార్లీ ఆ పని చేస్తాడు. కానీ ఆ నాణెం చేతులు మారే టైమ్‌లో సీన్ రివర్స్ అవుతుంది. అక్కడే వియెన్నా గ్యాంగ్‌స్టర్లకు డ్రైవర్‌గా పనిచేసే జోసెఫ్ అనే అమాయకపు వ్యక్తి చార్లీకి పరిచయమవుతాడు. ఆ నాణెం కోసం బెర్లిన్ సిండికేట్, వియెన్నా మాఫియా, చివరకు ఫ్రెంచ్ గ్యాంగ్‌లు కూడా వీరి వెనుక పడటంతో చార్లీ, జోసెఫ్ ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వస్తుంది.
మొదటి సీజన్ అంతా ఈ ఇద్దరూ వేర్వేరు గ్యాంగ్‌ల నుంచి తప్పుకుంటూ, తమను తాము కాపాడుకోవడానికి పడే పాట్లతో చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. వీరిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఇటీవల వచ్చిన సీజన్ 2 లో వీరి కథ బ్యాంకాక్, థాయిలాండ్ లాంటి కొత్త దేశాలకు మారుతుంది. అక్కడ సరికొత్త క్రిమినల్స్, ఊహించని ట్విస్టుల మధ్య చార్లీ తన భార్యాపిల్లలను ఎలా సేఫ్ ప్లేస్‌కి చేర్చాడు, జోసెఫ్ అతనికి ఎలా సాయం చేశాడు అనేదే మిగతా స్టోరీ. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో కాకపోయినా, ఈజీగా అర్థమయ్యే హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది.

