Ajinkya Rahane Play NPL season 3: టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు నిన్న అధికారిక ప్రకటన చేశాడు అజింక్య రహానే. తన 20 ఏళ్ల కెరీర్ లో తనకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే అలాంటి అజింక్య రహానే రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశాన్ని వదిలి నేపాల్ లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ లో ఆడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.
రహానే షాకింగ్ నిర్ణయం…నేపాల్ తరఫున ఆడేందుకు ఒప్పందం ?
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) దేశాన్ని వదిలి.. నేపాల్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో (Nepal Premier League Season 3) ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడట. ఐపీఎల్ టోర్నమెంట్ కు కూడా అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నేపాల్ ప్రీమియర్ లీగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 టోర్నమెంట్ ఈ ఏడాది నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనుంది. ఇందులో మొత్తం ఎనిమిది గంటలు పాల్గొనడం ఉండగా.. బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ ( Biratnagar Kings Hint) తరఫున అజింక్య రహానే కనిపించనున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడట. ఈ జట్టు తరఫున అజింక్య రహానేకు భారీ ఆఫర్ కూడా వచ్చిందట. కెప్టెన్సీ పగ్గాలు కూడా ఇస్తామని ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇండియన్ క్రికెటర్ విదేశీ టోర్నమెంట్స్ లో ఆడాలంటే ఎలా ?
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో దర్జాగా నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అజింక్య రహానే ఆడుకోవచ్చు. అతడికి ఎలాంటి బీసీసీఐ రూల్స్ అమలు కావు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి… ఐపీఎల్ తో పాటు నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడతానంటే అస్సలు కుదరదు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇస్తేనే… విదేశీ టోర్నమెంట్స్ లో ఇండియన్ క్రికెటర్లు వాడే అవకాశం ఉంటుంది. బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ ( Biratnagar Kings Hint) తరఫున ఆడేందుకు అజింక్య రహానే సిద్ధం అవుతున్నారు.
Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

