Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంబానీ కోసం కాళ్లు విరిగినా ఆడతావ్.టీమిండియాకు ఆడమంటే గాయాలు గుర్తుకు వస్తాయా ?

అంబానీ కోసం కాళ్లు విరిగినా ఆడతావ్.టీమిండియాకు ఆడమంటే గాయాలు గుర్తుకు వస్తాయా ?

Big TV Live 5 days ago

Kris Srikkanth Mocked Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇటీవల గాయపడ్డ సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ వన్డే సందర్భంగా అతడి పాత గాయం తిరగబడింది.

ఎడమ మోకాలి గాయం తిరగ బడడంతో, శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కు కూడా దూరమయ్యాడు జస్‌ప్రీత్ బుమ్రా. జులై 31వ తేదీన ఫిట్నెస్ టెస్ట్ లో పాసై.. ఆ తర్వాత గాయం అయిందంటూ బుమ్రాను తప్పించేశారు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో అకీబ్ నబీ ఆడుతున్నాడు. అయితే తరచూ జస్‌ప్రీత్ బుమ్రా గాయ పడడంపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఫైర్ అయ్యారు. నీకు టీమిండియా కంటే ముంబై ఇండియన్స్ ఎక్కువైందా ? అంటూ ప్రశ్నించారు. అంబానీ కోసం కాళ్లు విరిగినా ఆడతావ్…టీమిండియాకు ఆడమంటే గాయాలు గుర్తుకు వస్తాయా ? అని ఓ రేంజ్ ఫైర్ అయ్యారు.

టీమిండియాకు రిటైర్మెంట్ ఇచ్చి, ఇక ముంబై ఇండియన్స్ కు ఆడుకో

ఎప్పుడు న్యూస్ చూసిన జస్‌ప్రీత్ బుమ్రాకు గాయమైందని హెడ్లైన్స్ వస్తున్నాయని ఫైర్ అయ్యారు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth). ముఖేష్ అంబానీకి సంబంధించిన ముంబై ఇండియన్స్ కు ఆడమంటే ఎన్ని గాయాలు ఉన్నా ఆడతాడని ఆగ్రహించారు. అదే టీమ్ ఇండియాకు ఆడమంటే ఆ నొప్పి, ఈ నొప్పి అంటూ డ్రామాలాడుతాడని బుమ్రాపై విమర్శలు చేశారు. ఈ డ్రామాల కంటే టీమిండియా కు రిటైర్మెంట్ ప్రకటించి, ముంబై ఇండియన్స్ కు పర్మినెంట్ గా ఆడుకోవచ్చు కదా ? అని హేళన చేస్తూ మాట్లాడారు.

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబర్ ఆజం ఆడుతున్నాడు..ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడు!

దీనిపై బీసీసీఐ ( BCCI) వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్ ( IPL) కారణంగా చాలా మంది గాయాల బారిన పడుతున్నారని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ముందుకు సాగాలని కోరారు. ఇలాగే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయాలతో ఉంటే.. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు. అతని స్థానంలో ఇప్పటి నుంచే మరో బౌలర్ ను తయారు చేయాలని సూచించారు.

ఐపీఎల్ ఆడే క్రికెటర్ల పై బీసీసీఐ దృష్టి పెట్టాలి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడే భారత క్రికెటర్ల పై బీసీసీఐ కచ్చితంగా దృష్టి పెట్టాలని క్రిస్ శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టోర్నమెంటులో గాయాలు అయినప్పటికీ కూడా… డబ్బుల కోసం తెగించి మ్యాచ్లు ఆడుతున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆ గాయాలు అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగినప్పుడు తిరగబడుతున్నాయని గుర్తు చేశారు. జాతీయ జట్టుకు ఆడినా, ఆడకపోయినా డబ్బులు వస్తాయన్న లూప్ హోల్ తో క్రికెటర్లు తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కీలక సమయాలలో టీమిండియాను ముంచుతున్నారని బుమ్రాను ఉద్దేశించి విమర్శలు చేశారు క్రిస్ శ్రీకాంత్.

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live