Amazon Great Summer Sale 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. 2026 ఏడాదికి గాను మరో సరికొత్త సేల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుత వేసవి దృష్ట్యా 'అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్' (Amazon Great Summer Sale 2026) ప్రకటించింది.
మరో 3 రోజుల్లో ఈ సేల్ అధికారికంగా మెుదలు కానుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మెుబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఆఫర్ వివరాలను సైతం విడుదల చేసింది. ఇంతకీ ఈ సేల్ ఎప్పుడు మెుదలు కానుంది? ఎలాంటి ఆఫర్లు లభించనున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
సేల్ ప్రారంభం ఎప్పుడంటే?
అమెజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సమ్మర్ సేల్ మే 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. అయితే ముందుగా ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్ లో యాక్సెస్ లభించనుంది. సాధారణ కస్టమర్లకు మే 9వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. మే 12 – 14 వరకూ ఈ సేల్ జరగవచ్చని అమెజాన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బ్యాంక్ ఆఫర్లు
సేల్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఆఫర్లు, ఆఫర్ల వివరాలను అమెజాన్ ప్రకటించింది. వీటిని ఉపయోగించి వస్తువులు కొనుగోలు చేస్తే భారీగా డబ్బును పొదుపు చేసుకోవచ్చని తెలిపింది. ముందుగా బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, EMI లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడే ప్రైమ్ మెంబర్లకు 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
రోజుకు రూ.9 ఈఎంఐ!
కొన్నింటిపై నో కాస్ట్ ఈఎంఐ సైతం సమ్మర్ సేల్ లో అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై రోజుకు కేవలం రూ.9 నుండి నో-కాస్ట్ ఈఎంఐ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఇవి కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు సైతం కస్టమర్లు వినియోగించుకోవచ్చు. పాత మొబైల్స్ లేదా వస్తువుల మీద భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉంటాయని అమెజాన్ స్పష్టం చేసింది.
ఐఫోన్లపై రూ.50 వేల డిస్కౌంట్!
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై సేల్ ప్రారంభానికి ముందే భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫలితంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) దాదాపు రూ.94,999 ప్రారంభ ధరకే లభించే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 16, 15 ధరలు.. రూ.50,000 వరకూ తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సేల్ లో వన్ ప్లస్ నార్డ్ 5 (OnePlus Nord 6) సుమారు రూ.36,999 ధరకు లభించొచ్చని అమెజాన్ వర్గాలు వెల్లడించాయి. ఇవికాకుండా ఐకూ 15 ఆర్ (iQOO 15R), రియల్ మీ (Realme), రెడ్ మీ (Redmi) ఫోన్లపై కూడా క్రేజీ ఆఫర్లు ఈ సమ్మర్ సేల్ లో ఉండనున్నట్లు సమాచారం.
చౌకగా ఏసీలు, ఫ్రిడ్జ్‌లు
వేసవిలో ఏసీలు, ఫ్రిడ్జ్ లకు ఉండే డిమాండ్ గురించి తెలిసిందే. అయితే అమెజాన్ సమ్మర్ సేల్ లో వీటిపై 65 శాతం వరకూ డిస్కౌంట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే వాషింగ్ మిషన్లను సైతం అంతేస్థాయి రాయితీతో దక్కించుకోవచ్చని ఈ-కామర్స్ వర్గాలు ప్రకటించాయి. అలాగే ల్యాప్ టాప్ లపై 35%, టాబ్లెట్లపై 70% వరకు రాయితీ లభించనుంది. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు కేవలం రూ.6,999 ప్రారంభ ధరతో లభించనున్నాయి. అమెజాన్ ఎకో (Alexa), ఫైర్ టీవీ స్టిక్ ఉత్పత్తులపై 45% వరకు రాయితీ పొందొచ్చు. దుస్తులు, చెప్పులు, మేకప్ ఉత్పత్తులపై 50% నుండి 80% వరకు భారీ ఆఫర్లు లభిస్తాయని అమెజాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
Poco C81 vs Poco C81x: రెండూ మధ్యతరగతి ఫోన్లే.. పైగా ధర తక్కువ.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?
షాపింగ్ కోసం ఏఐ ఫీచర్..
షాపింగ్‌లో సహాయం చేయడానికి అమెజాన్ తన కొత్త ఏఐ అసిస్టెంట్ ‘రూఫస్’ (Rufus AI)ను సమ్మర్ సేల్ కోసం అందుబాటులో ఉంచనుంది. దీని ద్వారా మీరు ఉత్పత్తుల మధ్య పోలికలు, బెస్ట్ డీల్స్ గురించి నేరుగా రూఫస్ ను అడిగి తెలుసుకోవచ్చు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని అమెజాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బడ్జెట్ వినియోగదారుల కోసం అమెజాన్ బజార్ లో రూ.299 లోపు లభించే వస్తువులపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు సైతం ఈ సేల్ లో లభించనున్నాయి.
రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కు టాప్ ఛాయిస్!

