Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?

అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?

Big TV Live 1 week ago

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ఎట్టకేలకు రెండేళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ.. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ తో..

తన మాజీ భార్యలు, పిల్లల సమక్షంలో తన ఇంట్లో రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సుమారుగా 150 మంది అతిధులు విచ్చేసిన విషయం తెలిసిందే. సింపుల్గా జరిగిన ఈ వివాహం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అధికారికంగా గౌరీ స్ప్రాట్ అమీర్ ఖాన్ మూడవ భార్యగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి గౌరీ మెడలో మెరిసిన పఠానీ హార్ పైనే పడింది అని చెప్పాలి. హైదరాబాదీ పఠానీ హార్ తో ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది గౌరీ. మరి దీని ప్రత్యేకత.. ఖరీదు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఆభరణాలు..

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి వేడుకలు అంటే ఎప్పుడూ కూడా వధువు, వరుడు ధరించే నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాంప్రదాయం , రాజసాన్ని ప్రతిబింబించే ఆభరణాలను సెలబ్రిటీలు ఎంచుకుంటే వాటిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఒకప్పుడు హీరోయిన్లే తమ నగలతో ఆకట్టుకుంటుంటే.. ఇటీవల విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి హీరోలు కూడా రాజసం ఉట్టిపడేలా నాటి కాలం నాటి ఆభరణాలు ధరించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అందుకే సెలబ్రిటీల పెళ్లి వేడుకలు అంటే వారి ఆభరణాలే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతున్నాయి.

గౌరీ మెడలో మెరిసిన పఠానీ హార్..

ఇకపోతే ఈమధ్య కాలంలో హైదరాబాద్ నిజామీ వారసత్వానికి చెందిన ఆభరణాలు.. బాలీవుడ్ ప్రముఖులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు సత్లదా హార్ తో వార్తల్లో నిలిచిన పలువురు స్టార్ హీరోయిన్ల జువెలరీ జాబితాలో ఇప్పుడు మరో పేరు వచ్చి చేరింది. ఇక అందులో భాగంగానే హైదరాబాదీ పఠానీ హార్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వేడుకలో గౌరీ ఐవరీ, పాస్టెల్ షేడ్స్ తో రూపొందించిన సొగసైన లెహంగా ధరించింది. ఈ దుస్తులకు పోల్కి నగలను జతచేసి క్లాసిక్ బ్రైడల్ లుక్ ను తీసుకొచ్చింది. ఇకపోతే అందర్నీ ఆకర్షించింది మాత్రం ఆమె మెడలో మెరిసిన పఠానీ హార్.

రాజ దర్బార్లలో ప్రత్యేక గుర్తింపు..

ఈ హారం పఠాన్ కమ్యూనిటీతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ హైదరాబాద్ నిజామీ రాజదర్బార్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన వారసత్వ ఆభరణంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే అనేక వారసత్వ నగల నిపుణులు దీనిని హస్త కళకు ప్రతీకగా పేర్కొంటున్నారు. దీని ప్రత్యేకత దాని పోల్కి రత్నాల పనితనంలో ఉంటుంది. చేతితో రూపొందించే ఈ హారంలో ఒక్కో రత్నాన్ని చాలా శ్రద్ధగా అమర్చుతారు. అందుకే ఇదొక ప్రత్యేక కళాఖండంగా భావిస్తారు. ముఖ్యంగా రాజస్థాన్ సాంప్రదాయాన్ని ఒకేసారి ప్రతిబింబించే ఈ డిజైన్ ఇప్పటికీ ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ హారాన్ని ధరించడం కొన్ని వర్గాలలో ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

ధర ఎంతంటే?

ఇకపోతే గౌరీ ధరించిన ఈ నిజామీ పఠానీ హార్ ధర విషయానికొస్తే.. సాధారణంగా ఇది రూ.15,000 నుండి రూ.22 వేల వరకు ఉంటుంది. అయితే ఈ హారాలు వాటిలో ఉపయోగించే ముత్యాలు , రత్నాలు అలాగే గోల్డ్ ప్లేటింగ్ను ఆధారంగా చేసుకొని ధరలు మారుతూ ఉంటాయి. ప్యూర్ హైదరాబాదీ ముత్యాలు, పౌలీతో తయారైన ఈ హారాల ధర తక్కువగానే ఉండడంతో అటు ఫ్యాషన్ ప్రియులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ఈ హారం ధర చాలా తక్కువగా ఉండటంతో అటు నెటిజన్లు గౌరీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేలకోట్ల ఆస్తులున్న అమీర్ ఖాన్ మూడవ భార్యగా అడుగులు వేస్తున్నప్పటికీ ఒకవైపు సాంప్రదాయానికి విలువనిస్తూనే.. ఇలా సింపుల్ గా అందరి దృష్టిని ఆకర్షించారు గౌరీ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live